Begin typing your search above and press return to search.

ఫ్యాన్‌పై నాని హీరోయిన్‌ చిర్రుబుర్రు

By:  Tupaki Desk   |   28 Jun 2015 7:35 AM GMT
ఫ్యాన్‌పై నాని హీరోయిన్‌ చిర్రుబుర్రు
X
ఇటీవలే చెన్నయ్‌లో ఫిలింఫేర్‌ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. వన్నె చిన్నెల వయ్యారి భామలంతా ఫిలింఫేర్‌ వేదికను చిత్తడి చిత్తడి చేసేశారు. ఎటు చూసినా రంగులమయమే. ఓ వైపు తారల ఫోటోషూట్‌ల పర్వం, మరోవైపు అవార్డు వేదికపై పురస్కార ప్రకటనలు, ఇంకోవైపు డ్యాన్సులు, సింగింగ్‌.. ఇలా రేతిరంతా జాగారం అయిపోయింది.

అయితే సరిగ్గా ఇదే చోట ఓ కుర్రతార కోపంతో ఊగిపోయింది. ఓ అభిమాని తనని ఫోటో తీసుకోవడానికి ఎగబడినందుకు అతడిని కొరకొరా చూసింది. అంతమందిలో ఏమీ చేయలేకపోయింది కానీ అతడిని చంపేసేదే. అయితే అంత కోపాన్ని తమాయించుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయిన ఈ భామ ఎవరు? అని ఆరాతీస్తే నాని హీరోయిన్‌ 'ఎవడే సుబ్రహ్మణ్యం' ఫేం మాళవిక అని తెలిసింది. మాళవిక ఆరోజు ఓ ప్రత్యేకమైన బులుగు జిలుగు పర్పుల్‌ డ్రెస్‌లో వచ్చింది. చూడగానే యువరక్తం మరిగిపోయే సిట్యుయేషన్‌. అందుకే ఆ అభిమాని ఫోటో కోసం ఎగబడి అనవసరంగా చిర్రుబుర్రుకు ఎరయ్యాడు. అంతేకాదండోయ్‌ మాళవిక ఓ అవార్డు కూడా అందుకుంది ఈ వేదికపై.

రాజు మురుగన్‌ దర్శకత్వం వహించిన కుకూ సినిమాలో నటనకు గాను 'ఉత్తమ నటి' అవార్డ్‌ అందుకుంది. కెరీర్‌ ఆరంభమే ఇలాంటి అరుదైన అవకాశాన్ని అందుకున్న ఈ భామపైనే ఇప్పుడు అందరికళ్లు ప్రసరిస్తున్నాయి. నందినిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాలో నాయికగా ఎంపికైంది. మరిన్ని తమిళ చిత్రాలకు సంతకాలు చేయడానికి రెడీ అవుతోందీ భామ. అదీ సంగతి.