Begin typing your search above and press return to search.

మహేష్ సరసన దళపతి బ్యూటీ..!

By:  Tupaki Desk   |   9 Jun 2021 11:00 PM IST
మహేష్ సరసన దళపతి బ్యూటీ..!
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. కొత్త సినిమాలు ప్రకటించడమే ఆలస్యం సినిమా గురించి ఆరా తీయడం - రూమర్స్ క్రియేట్ చేయడం మాములే అయిపోయింది. అయితే మహేష్ సినిమాకు సంబంధించి దర్శకుడి కంటే కూడా ఆయన సరసన కనిపించబోయే హీరోయిన్ ఎవరనే ఆసక్తి ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను గీతగోవిందం ఫేమ్ పరశురామ్ తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ టైం మహేష్ - పరశురామ్ కాంబినేషన్ సెట్ అయ్యేసరికి సినిమా పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అలాగే సర్కారు వారి పాట అనే టైటిల్ సినిమా పై మరిన్ని అంచనాలు పెంచేసింది.

గతేడాది కాలంగా ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంది. అందుకు కరోనా మహమ్మారి కారణం అనేది విదితమే. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ ఫస్ట్ టైం నటిస్తోంది. ఈ కాంబినేషన్ పై మూవీలవర్స్ బాగానే ఎక్సపెక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఓ సినిమా ప్రకటించాడు. ఎందుకంటే ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి సినిమాలో జాయిన్ కాబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. సోషల్ మీడియాలో మహేష్ - త్రివిక్రమ్ తదుపరి సినిమా హీరోయిన్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే మహేష్ బాబు జోడిగా త్రివిక్రమ్ సినిమాలో అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ ను సంప్రదించిన్నట్లు ఓవైపు వార్తలొస్తున్నాయి. అయితే జాన్వీ ప్రస్తుతం పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. అలాగని మంచి సూపర్ ఫామ్ లో ఉందని చెప్పలేం. ఎందుకంటే ఇటీవలే అమ్మడు నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. ఆమెతో పాటు మధ్యలో పూజాహెగ్డే - సారా అలీఖాన్ పేర్లు కూడా బాగానే వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఎవరు కన్ఫర్మ్ కాలేదు. కానీ తాజాగా మాస్టర్ బ్యూటీ పేరు వెలుగులోకి వచ్చింది. సూపర్ స్టార్ సరసన మాళవిక మోహనన్ నటించనుందని టాక్ నడుస్తుంది. మరి మహేష్ సరసన హీరోయిన్ అంటే మినిమం ఎక్సపెక్టషన్స్ ఉంటాయి. సో చూడాలి మరి ఎవరు కన్ఫర్మ్ అవుతారో..!