Begin typing your search above and press return to search.

బూచ‌మ్మ‌లా భ‌య‌పెడుతున్న ఈ బ్యూటీ ఎవరో క‌నిపెడ‌తారా?

By:  Tupaki Desk   |   30 March 2021 3:30 AM GMT
బూచ‌మ్మ‌లా భ‌య‌పెడుతున్న ఈ బ్యూటీ ఎవరో క‌నిపెడ‌తారా?
X
చూస్తుంటే.. బూచ‌మ్మ‌లా భ‌యపెట్టేస్తోంది. ఎవ‌రీ అమ్మ‌డు? ఒళ్లంతా రంగులు పులుముకుని పండుగ‌ను ఓ రేంజులోనే సెల‌బ్రేట్ చేసింద‌ని అర్థ‌మ‌వుతోంది. హోలీని ఇంత భ‌యంక‌రంగా జ‌రుపుకోవ‌చ్చ‌ని మా బాగానే చెప్పింది కానీ.. మరీ చిన్న పిల్ల‌లు రోడ్ల‌పై తిర‌క్కుండా భ‌య‌పెట్టేస్తోంది.

ఇంత‌కీ ఎవ‌రు ఈ భామ‌? అంటే.. నేల టిక్కెట్ .. రెడ్ చిత్రాల‌తో తెలుగు వారికి బాగా సుప‌రిచిత‌మైన ఈ బ్యూటీ మాళ‌విక శ‌ర్మ‌. రంగుల్లో మునిగి తేల‌డం వ‌ల్ల వెంట‌నే గుర్తు ప‌ట్ట‌డం క‌ష్టంగా ఉంది. త‌న ఇంటి పరిస‌రాల్లోనే ఫ్రెండ్స్ క‌జిన్స్ తో క‌లిసి హోలీ పండుగ‌ను ఓ లెవ‌ల్లోనే సెల‌బ్రేట్ చేసుకుందీ భామ‌. అలా ఆ అంద‌మైన కురులు మీదుగా రంగులు ఒల‌క‌బోసారు. ముఖం ఒళ్లంతా రంగులమ‌యం అయ్యింది. క‌ళ్ల‌కు ఉన్న ఆ స్పెక్ట‌కిల్స్ పైనా రంగులు చిమ్మాయి. చిట్టి పొట్టి నిక్క‌రులో సింపుల్ గా అలా న‌మ‌స్కారం ఫోజులో ఉన్నా కాళ్ల‌పైనా రంగులు పులిమేసిన తీరు చూస్తుంటే బాగా మాస్ స్టైల్లోనే ఈ పండుగ‌ను జ‌రుపుకుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఉత్త‌రాదిన హోలీకి ఎప్పుడూ అత్యంత ప్రాధాన్య‌త ఉంది. దానికి త‌గ్గ‌ట్టే వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

ఇటీవ‌లి కాలంలో మాళ‌విక సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటోంది. ఇన్ స్టాలో ఫోటోల్ని షేర్ చేస్తూ అల‌రిస్తోంది. హోలీ సెల‌బ్రేష‌న్ ని షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ప్ర‌స్తుతం తెలుగు లో ఆఫ‌ర్లు ఏవీ లేవు. త‌దుప‌రి ప్ర‌ణాళిక ఏమిటి? అన్న‌ది మాళ‌విక‌నే చెప్పాల్సి ఉంటుంది.