Begin typing your search above and press return to search.

దీపికను తప్పించి ఈమెను తెచ్చారు

By:  Tupaki Desk   |   15 March 2017 4:51 AM GMT
దీపికను తప్పించి ఈమెను తెచ్చారు
X
మలయాళీ సినిమాల్లో తెగ బిజీగా ఉన్న బ్యూటీ మాళవికా మోహనన్. ఈమె లెజెండరీ సినిమాటోగ్రాఫర్ కే.యు. మోహనన్ కుమార్తె. ఇప్పుడీ మాళవిక ఇరానియన్ ఫిలిం మేకర్ అయిన మాజిద్ మాజిది ని తన లుక్స్ తో మెప్పించగలగింది. అతని డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అయిన 'బెయాండ్ ద క్లౌడ్స్' లో భాగం పొందింది.

ఈ చిత్రాన్ని మొదట దీపికా పదుకొనేతో తీయాలని భావించాడు దర్శకుడు. ఇందుకోసం లుక్ టెస్ట్ కు ఆమెను పిలిచారు. అయితే.. ఈ లుక్ టెస్ట్ కి సంబంధించిన ఫోటోలు అప్పటికప్పుడే ఆన్ లైన్ లో దర్శనం ఇవ్వడాన్ని.. దర్శకుడు జీర్ణించుకోలేకపోయాడు. మరో హీరోయిన్ ను వెతుక్కోవడం ప్రారంభించాడు. చివరకు ఇతని సెర్చింగ్.. మాళవికా మోహనన్ దగ్గర ఆగింది. తన కథలోని కేరక్టర్ కు తగినట్లుగా ఉండడంతో.. ఆమెకే అవకాశం కట్టబెట్టాడు దర్శకుడు మాజిద్. కొన్ని రోజుల క్రితం షూటింగ్ కూడా ప్రారంభం కావడంతో .. దీపిక ప్లేస్ లో మాళవిక వచ్చి చేరడం ఖాయం అయింది.

'ఇది నా మొదటి హిందీ సినిమా కావడంతో చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అంతర్జాతీయంగా కూడా నాకు ఈ చిత్రం ద్వారా పేరు లభిస్తుంది' అని చెబుతోంది మాళవిక. బెయాండ్ ద క్లౌడ్స్ మూవీలో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ నటిస్తుండగా.. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/