Begin typing your search above and press return to search.

నడుము అందాలతో పిచ్చెక్కిస్తున్న మాస్టర్ సుందరి!

By:  Tupaki Desk   |   11 Jun 2020 4:00 PM GMT
నడుము అందాలతో పిచ్చెక్కిస్తున్న మాస్టర్ సుందరి!
X
మాళవిక మలయాళ నటి. ఒకటి రెండు హిందీ, తమిళంలో చేసినా రావాల్సినంత గుర్తింపు రాలేదు. కానీ మాస్టర్ సినిమాలో తన పోస్టర్ రిలీజ్ చేసేసరికి అమ్మడు గాల్లో తేలిపోతుంది. అదీగాక ఇళయదళపతి విజయ్, విజయ్ సేతుపతి లాంటి సూపర్ స్టార్లతో లీడింగ్ రోల్ చేయడమంటే.. త్వరలోనే అమ్మడికి మంచి రోజులు రాబోతున్నాయి అంటే అతిశయోక్తి కాదు. మాళవిక మోహనన్ పేరు మొన్నటి వరకు సినిమా సౌత్ సినీ ఇండస్ట్రీలకు కూడా పెద్దగా పరిచయం లేదు. అలాంటిది ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈమె గురించి చర్చ మొదలైందంటే మ్యాటర్ కాస్తా ఇంపార్టెంట్ అన్పిస్తుంది కదా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కూతురే ఈ మాళవిక మోహనన్. మరి సడన్ గా వైరల్ ఎందుకయ్యింది. అంటే ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న "మాస్టర్" సినిమానే కారణం.

సోషల్ మీడియాలో అందమైన నవ్వుతో కుర్రకారు మనసు దోచుకుంటుంది. ప్రస్తుతం ఈ భామకు తెలుగులో ఛాన్సులు రానప్పటికీ మాస్టర్ తర్వాత ఖచ్చితంగా వస్తాయని గంపెడు ఆశలతో ఉంది. ఈ లోపు సోషల్ మీడియాలో ఫోజులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఈ భామ తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో చీర ధరించి నడుము అందాలను ప్రదర్శిస్తుంది. అలా రెండు చేతులు పైకి లేపి పూల సారీలో అమ్మడి అందాలు పిచ్చెక్కిస్తున్నాయి. మాళవిక నిలుచున్న పోజు.. మొహంలో ఆ ఎక్స్ ప్రెషన్.. కనిపించి కనిపించకుండా ఉన్న ఆ సన్నని నడుము అందాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం మాళవిక తెలుగులో కూడా రావాల్సి ఉంది.. అదికూడా విజయ్ దేవరకొండతో.. అని మురిసిపోయింది. కానీ ఆ సినిమా ప్రస్తుతం పక్కన పడింది. ఇక మాస్టర్ సినిమాతో అమ్మడు రచ్చ చేసేలా ఉంది.