Begin typing your search above and press return to search.

మాస్టర్ బ్యూటీ.. మరో భారీ ఆఫర్ కొట్టేయనుందా..??

By:  Tupaki Desk   |   17 July 2020 4:00 PM GMT
మాస్టర్ బ్యూటీ.. మరో భారీ ఆఫర్ కొట్టేయనుందా..??
X
స్టార్ తమిళ హీరో విక్రమ్ కి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. శివపుత్రుడు సినిమా దగ్గర నుండి ఆయన ప్రతీ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది. అయితే, ఈ మధ్య కాస్త స్లో అయ్యారని చెప్పాలి. ఇటీవల వచ్చిన ‘సామి 2’, మిస్టర్ కెకె సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో తనలోని వైవిధ్యమైన నటుడిని మరోసారి ప్రేక్షకులకు చూపించడానికి విక్రమ్ సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం తన 58వ సినిమాను కంప్లీట్ చేస్తున్నారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'కోబ్రా' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ మూవీ చేస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ కార్తిక్‌ సుబ్బరాజుతో విక్రమ్ 60వ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. భారీ మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కించనున్న ఈ సినిమాలో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ కూడా నటిస్తుండటం విశేషం.

ప్రస్తుతం వరుస హిట్లలో ఉన్న కార్తీక్ డైరెక్షన్ కాబట్టి భారీ అంచనాలు నెలకొన్నాయి. మాఫియా నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో విక్రమ్ పాత్ర నెగటివ్ షేడ్స్ లో.. ధృవ్ పాజిటివ్ యాంగిల్ లో ఉంటాయని సమాచారం. తండ్రికొడుకుల పోరు ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం తండ్రితో పోటీ పడటానికి ధృవ్ బాడీని పెంచే పనిలో పడ్డాడు. ఇటీవలే జిమ్ లో వర్కౌట్ చేస్తున్న పిక్ షేర్ చేశాడు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో విక్రమ్ సరసన మాస్టర్ బ్యూటీ మాళవిక మోహనన్ కనిపించబోతుందని వినికిడి. డైరెక్టర్ కార్తీక్ మాళవిక అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఈ మలయాళీ భామ అదృష్టం ఎలా ఉందో.. ఈ మూవీ ఓకే అయితే గనక అమ్మడి కెరీర్లో భారీ ఆఫర్స్ వచ్చిపడే అవకాశం ఉంది.