Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ:మల్లు పాప చీరకడితే అంతేగా అంతేగా!

By:  Tupaki Desk   |   18 April 2020 3:00 PM GMT
ఫోటో స్టోరీ:మల్లు పాప చీరకడితే అంతేగా అంతేగా!
X
హాట్ నెస్ కు ఎల్లలు లేవు. ఘాటు భామలకు సరిహద్దులు ఉండవు. అందుకే కేరళ భామ మాళవిక మోహనన్ కు హాట్ సమాజంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ సమాజం వారు మాళవిక కు ఎంతో గౌరవం ఇస్తూ ఉంటారు. ఆమె పోస్ట్ చేసే ఫోటోలకు సంభ్రమాశ్చర్యాలకు గురి అవుతూ ఉంటారు. ఇప్పటివరకు ఈ భామ తెలుగులో నటించలేదు గాని త్వరలో తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న సినిమా 'మాస్టర్' తెలుగు వెర్షన్ తో మనల్ని పలకరించబోతోంది.

ఈ భామకు పురుష సమాజం అంటే ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియదు కానీ తన హాట్ ఫోటోలతో వారికి ఊపిరాడకుండా చేస్తుంది. సున్నితమైన కళాపోషకులు అయితే ఈ లాక్ డౌన్లో బయటికిపోలేక.. ఇంట్లో ఉండలేక మాళవిక వేడిని తట్టుకోలేక సతమతమైపోతారు. తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "చీర ఓ మూడ్" అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చింది. సన్నటి గీతలు ఉన్న నలుపు రంగు చీర ధరించి నడుము అందాలను ఆవిష్కృతం చేస్తూ అద్దం ముందు నిలబడి స్వయంగా ఒక ఫోటో తీసుకుంది. మాళవిక నిలుచున్న పోజు.. మొహంలో ఆ ఎక్స్ ప్రెషన్.. కనిపించి కనిపించకుండా దోబూచులాడుతున్న నాభి అందాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఫోటో పదివేల ఓల్టుల కరెంటు తీగ తో సమానం అని చెప్పక తప్పదు.

ఈ ఫోటోకు మూడు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. కొందరు ఆసక్తికరమైన కామెంట్లు కూడా పెట్టారు. "ఖుషి ని గుర్తు చేశావు".. "హాటెస్ట్ పిక్ ఇన్ శారీ".. "కిల్లర్ బ్యూటీ" అంటూ కామెంట్ పెట్టారు. లాక్ డౌన్లో సమయంలో కూడా ఈ గ్లామర్ నాక్ అవుట్ పంచులను విసరడం.. ఎంతోమంది నెటిజన్లను మాయలో పడేయడం మాళవికకు అలవాటుగా మారిపోయింది. లాక్ డౌన్ విరమణ ప్రకటించే వరకు ఈ నాక్ అవుట్ ఉద్యమం ఆగేలా లేదు!