Begin typing your search above and press return to search.

హ‌వ్వ‌! మాస్టారుకే లైనేసిన ల‌వ్ లీ హీరోయిన్!!

By:  Tupaki Desk   |   28 July 2020 10:30 AM IST
హ‌వ్వ‌! మాస్టారుకే లైనేసిన ల‌వ్ లీ హీరోయిన్!!
X
నెవ్వ‌ర్ బిఫోర్ హాటెస్ట్ గాళ్ ఇన్ సౌత్! అన్న గుర్తింపు ద‌క్కించుకుంది మాళ‌విక మోహ‌న‌న్. అంత‌గా వేడెక్కించే మ్యాట‌ర్ ఈ అమ్మ‌డిలో ఉండ‌బ‌ట్టే ఇప్ప‌టికిప్పుడు ఇటు సౌత్ లో వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీ అయిపోతోంది. ప్ర‌స్తుతం త‌మిళంలో ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌ర‌స‌న మాస్టార్ చిత్రంలో న‌టిస్తోంది.

పేట సినిమాతో కోలీవుడ్ ‌కి పరిచయమైన ఈ కేరళ కుట్టి విజయ్‌ దేవరకొండతో హీరో చిత్రంలో న‌టించాల్సిన‌ది. ఆ మూవీ షూటింగ్ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ ప్రేక్షకులకు మాత్రమే కాదు తెలుగు వారికి ఈ అమ్మ‌డి ట్రీట్ ముందుంది. ప‌లువురు అగ్ర హీరోలు స‌హా న‌వ‌త‌రం హీరోలు ఈ అమ్మ‌డి పేరును ప‌రిశీలిస్తున్నార‌న్న స‌మాచారం ఉంది. ప్ర‌స్తుతం మ‌హ‌మ్మారీ లాక్ డౌన్ పీరియ‌డ్ లో వ‌రుస ఫోటోషూట్ల‌తో దుమ్ము రేపుతోంది మాళ‌విక‌. ఈ అమ్మ‌డి లేటెస్ట్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

ఇక త‌న కోస్టార్ అయిన విజ‌య్ పై మాళ‌విక పొగ‌డ్త‌లు చూస్తుంటే `మాస్టార్`కే లైనేస్తోందా? అనిపించ‌క మాన‌దు. ``కూలెస్ట్ ఫ‌న్నీయెస్ట్ ల‌వ్వ‌బుల్ మాస్టార్ మా హీరో` అంటూ ఈ కేర‌ళ కుట్టి కితాబిచ్చేసింది మ‌రి. మాస్టార్ చిత్రం 2021 సంక్రాంతికి రిలీజ‌య్యే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. దీపావ‌ళికే రావాల్సిన‌ది మ‌హ‌మ్మారీ వ‌ల్ల షూటింగ్ ఆల‌స్య‌మైన సంగ‌తి తెలిసిందే.