Begin typing your search above and press return to search.
మార్ఫింగ్ ఫోటో షేర్ చేసిన వారిపై హాటీ ఫైరింగ్
By: Tupaki Desk | 4 Feb 2022 10:40 PM ISTఎక్కడ చూసినా ఫేక్ లు రాజ్యమేలుతున్న తరుణమిది. డిజిటల్ యుగంలో ప్రతిదీ ఫేక్ గా మారింది. ఫేక్ ఫోటోలతో ముప్పును ఎదుర్కొంటున్న చాలా మంది కథానాయికల ఆవేదనను అర్థం చేసుకోవాలి. తాజాగా మాళవిక మోహనన్ ఇంటర్నెట్ లో తన నకిలీ అసభ్యకరమైన ఫోటోని షేర్ చేసిన వారిని తూర్పారబట్టింది. ఇది చాలా చౌక బారు వ్యవహారం అంటూ చీవాట్లు పెట్టేసింది.
మాళవిక మోహనన్ ట్విట్టర్ లో అసలు విషయాన్ని వెల్లడించింది. ఫోటోషాప్ చేసిన అసభ్యకరమైన ఫోటో గురించి ప్రస్థావిస్తూ.. తన ఒరిజినల్ ఫోటోగ్రాఫ్ ను ఎవరో ఫోటోషాప్ చేసి నకిలీ అసభ్యకరమైన ఫోటోను రూపొందించారని దానిని ఇంటర్నెట్ లో షేర్ చేశారని నటి పేర్కొంది. నెటిజనులు సోషల్ మీడియాలో ఆ ఫోటోని చూసినట్లయితే తనకు రిపోర్ట్ చేయమని సాయం కోరింది.
తన నకిలీ అసభ్యకర ఫోటోలను ఉపయోగిస్తున్న వారిపై విరుచుకుపడింది. ఆమె ఆ ఫోటోను ట్వీట్ చేసి.. ``ఇది కొన్ని నెలల క్రితం తీసిన ఫోటో.. దీనిని ఎవరో ఫోటోషాప్ చేసి నకిలీ అసభ్యకరమైనదాన్ని సృష్టించారు. చాలా మంది వ్యక్తులు ప్రముఖ మీడియా సంస్థలు సహా ప్రచారం చేస్తున్నారు. ఇది కేవలం చౌకైన జర్నలిజం. . మీరు నకిలీని చూసినట్లయితే.. దయచేసి సహాయం చేయండి.. తొలగించండి`` అని కోరింది మాళవిక.
మాళవిక మోహనన్ తన మాల్దీవుల ఫోటోషూట్ తో ఇంటర్నెట్ లో మంటలు రేపుతోంది. అద్భుతమైన బికినీల్లో పోజులివ్వడమే గాక.. దీవుల్లో విహంగ వీక్షణతో ఆస్వాధించడం వరకు.. వారం పాటు ఆనందకరమైన సమయాన్ని గడిపింది. అనంతరం భారతదేశానికి తిరిగి వచ్చింది. విహార యాత్రకు సంబంధించిన మాళవిక ఫోటోలు అంతర్జాలంలో అగ్గి రాజేసాయి.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. మాళవిక మోహనన్ తదుపరి థ్రిల్లర్ మూవీ `మారన్` లో ధనుష్ తో స్క్రీన్ స్పేస్ ను పంచుకోనుంది. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సముద్రఖని.. స్మృతి వెంకట్ - కృష్ణకుమార్ బాలసుబ్రమణియన్ - మహేంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సత్యజ్యోతి ఫిల్మ్స్‌కు చెందిన TG త్యాగరాజన్- సెంధిల్ త్యాగరాజన్ - అర్జున్ త్యాగరాజన్ ఆర్థిక సహాయం అందించారు. ఈ చిత్రం డిస్నీ+ హాట్ స్టార్ లో OTT విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం నుండి పొల్లాద ఉలగం అనే మొదటి సింగిల్ విడుదలైంది. ధనుష్ ఇందులో సరికొత్తగా స్టైలిష్ అవతార్ లో కనిపించనున్నాడు. ఇందులో ఒక పాటను ధనుష్ స్వయంగా పాడారు అరివు ర్యాప్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.