Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: మాస్టర్ బ్యూటీ మెస్మరైజింగ్ వి-నెక్

By:  Tupaki Desk   |   18 March 2020 4:45 AM GMT
ఫోటో స్టోరీ: మాస్టర్ బ్యూటీ మెస్మరైజింగ్ వి-నెక్
X
కేరళ భామ మాళవిక మోహనన్ పేరు చాలా తక్కువమంది తెలుగు ప్రేక్షకులకు మాత్రమే తెలిసి ఉంటుంది. ఇప్పటికే మలయాళం.. తమిళం.. కన్నడ.. హిందీ భాషలను కవర్ చేసిన ఈ భామ తెలుగులో విజయ్ దేవరకొండ 'హీరో' తో ఎంట్రీ ఇవ్వాలి కానీ ఆ సినిమా క్యాన్సిల్ కావడంతో ఈ హాటీ ని జనాలు మిస్ అయ్యారు. అసలే మాళవిక న్యూ జెనరేషన్ బ్యూటీ. 'ఫోటో వినదుగా వినదుగా' అని పాడుకుంటూ హాట్ ఫోటో షూట్ల చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాను.. అందులో ఉండే నెటిజన్లను మురిపిస్తూ ఉంటుంది.

ఈమధ్య ఈ హాటీ ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. ఫుల్ షర్టు లాంటి ఆరెంజ్ టాప్.. ప్రపంచంలోనే అత్యంత పొట్టిగా ఉన్నదిగా అనిపించే డెనిమ్ మిడ్డీ ధరించి ఒక చోట కూర్చుంది. మెడలో బలంగా కనిపిస్తున్న బంగారు దండలు వేసుకుంది. జుత్తును అలా లూజ్ గా వదిలేసింది. చేతిపై తల పెట్టుకుని ఓ సెన్సువల్ పోజిచ్చింది. ఇక ఈ ఫోటోలో హైలైట్ ఏంటి అంటే ప్రత్యేకంగా వివరించాల్సిన పనే లేదు. ఎందుకంటే ఆ వీ నెక్ హాట్నెస్ దెబ్బకు కరోనా కూడా మాడి మసై పోయేలా ఉంది. ఇక సున్నితమైన మనసులు ఉండే కూల్ నెటిజన్లు ఏమై పోవాలి?

ఇలాంటి ఫోటోలను నెటిజన్లు వైరల్ చేసి మరీ జేజేలు తెలుపుతారు. ఈ ఫోటోను కూడా అలాగే వైరల్ చేసి లైక్స్ తో షేర్లతో హోరెత్తిస్తున్నారు. ఇక మాళవిక సినిమాల విషయానికి వస్తే తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా 'మాస్టర్' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో తనకు బ్రేక్ రావడం ఖాయమని నమ్మకంగా ఉందట.