Begin typing your search above and press return to search.

మ‌లైకా యోగా క్లాస్: బొడ్డు కొవ్వును క‌రిగించ‌డ‌మెలా?

By:  Tupaki Desk   |   15 Nov 2022 5:30 AM GMT
మ‌లైకా యోగా క్లాస్: బొడ్డు కొవ్వును క‌రిగించ‌డ‌మెలా?
X
మోడల్ కం నటి మలైకా అరోరా యోగా ఎక్స్ ప‌ర్ట్ అన్న సంగ‌తి తెలిసిందే. కెరీర్ ప‌రంగా ఎంత బిజీగా ఉన్నా మలైకా మాత్రం తన వర్కవుట్ లను విడిచిపెట్ట‌దు. జిమ్ - యోగా సెష‌న్స్ కి కావాల్సినంత సమ‌యం కేటాయిస్తుంది. ఫిట్ నెస్ విష‌యంలో అస్స‌లు అశ్ర‌ద్ధ చేయ‌దు. నేటిత‌రానికి ఈ టాప్ మోడ‌ల్ కం న‌టి ఎల్ల‌పుడూ స్ఫూర్తిగా నిలుస్తోంది. నిరంత‌ర బిజీ షెడ్యూల్స్ లోను ఆరోగ్యం కోసం స‌మ‌యాన్ని ఎలా కేటాయించాలో కూడా మ‌లైకా నేర్పిస్తోంది.

బాలీవుడ్ ఫ్యాష‌నిస్టా.. డ్యాన్సింగ్ క్వీన్ గా మలైకా అరోరా ఇన్ స్టాగ్రామ్ టైమ్ లైన్ నిరంత‌ర‌ వీడియోల‌తో బోలెడంత ట్రీటిస్తుంది. ప్ర‌తిసారీ ఆకర్షణీయమైన ఫోటో షూట్ లు .. ఫిట్ నెస్ వీడియోల తో మ‌లైకా అల‌రిస్తూనే ఉంది. స్నేహితులు కుటుంబ సభ్యులతో స‌ర‌దా జీవితాన్ని మలైకా సోషల్ మీడియాలో లైవ్ లీగా ప్ర‌ద‌ర్శించేందుకు ఇష్టపడుతుంది. ఇక త‌న‌లోని గ్లామ‌ర్ యాంగిల్ ని ఈ బ్యూటీ ఎప్పుడూ దాచిపెట్ట‌దు.

తాజాగా మ‌లైకా యోగా ప్రాక్టీస్ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. మ‌లైకా ఒక క‌ర్ర సాయంతో అస‌నాలు ప్రాక్టీస్ చేస్తోంది. దీనివ‌ల్ల ప్ర‌యోజ‌నాల‌ను కూడా సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించింది. అభిమానులు తరచుగా కొన్ని ఫిట్ నెస్ ప్రేరణల‌ కోసం మల్టీ-హైఫనేట్ మ‌లైకాను అనుస‌రిస్తుంటారు. అలాంటి వారికి కావాల్సినంత వీనుల విందుతో పాటు అస‌నాల ప‌రంగా నాలెజ్ సంపాదించ‌డం సులువు. మలైకా ఎప్పుడు ఏం చేసినా గ్లామ్ ట‌చ్ ని ప‌రిపూర్ణంగా అందించడంలో అస్స‌లు విఫలం కాదు. తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ దీనికి చ‌క్క‌ని ఉదాహరణ.

చేతిలో పొడవాటి కర్రతో ఫిట్ నెస్ స్టూడియోలో మ‌లైకా త‌న స‌హ‌చ‌రుల‌తో క‌లిసి వర్కవుట్ చేస్తోంది. ఈ సెష‌న్ పై మలైకా మాట్లాడుతూ-"ఇది అద్భుత‌ సోమవారం.. నేను తిరిగి యోగాస‌నాల‌తో మీ ముందుకు వ‌చ్చాను. ఈసారి ఒక ఆసరాతో.." అని తెలిపింది. తన చేతిలోని కర్ర తన యోగా దినచర్యలో భాగమని వివరిస్తూ మలైకా అరోరా ఇలా రాశారు. "దండ యోగా నాకు ఇష్టమైన యోగా రూపాల్లో ఒకటి. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఇది బొడ్డు కొవ్వును తగ్గించడానికి అద్భుత యోగాస‌నం.. క‌స‌ర‌త్తు.. ముఖ్యంగా మీ నడుము చుట్టూ... చేతులు - కాళ్ళు -వెన్నెముక కండరాలకు కూడా ఈ అస‌నం గొప్ప ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. ఇది శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేస్తుంది. అందుకే ఈ ప్రత్యేకమైన వర్కౌట్ ని ప్రయత్నించండి" అని తన అనుచరులను ప్రోత్సహించింది. ఈ వారం మీ వర్కౌట్ కు ఒక క‌ర్ర‌ ఆసరాను జోడించండి. బాటిల్ వాటర్ లేదా టవల్ లాంటిది మీతో ఉండాలి. ఇది మీ వ్యాయామాన్ని మెరుగుపరుస్తుంది. మీకు చ‌క్క‌ని విశ్రాంతిని ఇస్తుంది... అని త‌న యోగా సెష‌న్ వీడియోని వైర‌ల్ చేసింది మ‌లైకా.

గత నెలలో మలైకా అరోరా తన జీవితంలో యోగా ప్రాముఖ్యత గురించి మాట్లాడింది. ఒక వీడియోను షేర్ చేస్తూ ఈ నెల అంతా బ్యాలెన్స్ గురించి వివ‌రిస్తాన‌ని తెలిపింది. తరచుగా మనం జీవితంలో క్ష‌ణం తీరిక లేని షెడ్యూళ్ల‌తో చిక్కుకుపోతాం. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోతాం. మన మనస్సు- శరీరాన్ని కాపాడుకునేందుకు మొగ్గు చూపలేం. అందుకే ఈ రోజు చాలా అరుదైన సందర్భంలో నేను ప్ర‌త్యేక అస‌నాన్ని ప‌రిచ‌యం చేయాల‌ని నిర్ణయించుకున్నాను. కానీ సమయాన్ని వెచ్చించడం కొన్నిసార్లు కష్టమవుతుందని నేను అర్థం చేసుకున్నాను. అందుకే నేను చేయాల్సిందల్లా బ్యాలెన్స్ నేర్చుకోవడమే'' అని మ‌లైకా త‌న‌వైన ప్రాక్టిక‌ల్ ఆలోచ‌న‌ల‌ను షేర్ చేసింది. ఉపయోగకరమైన ఫిట్ నెస్ చిట్కాల కోసం తన ఇన్ స్టాను అనుస‌రించాల‌ని కూడా మ‌లైకా కోరింది. మలైకా అరోరా కొన్ని హాటెస్ట్ భంగిమ‌ల‌తో యోగాస‌నాలు చేస్తున్న ఫోటోలు వీడియోల‌ను షేర్ చేస్తూనే ఉంది. మలైకా సోదరి అమృతా అరోరా తుఫాన్ అంటూ త‌న సోద‌రిని ప్ర‌శంసించింది. కొన్ని వారాల క్రితం మ‌లైకా పుట్టినరోజు సందర్భంగా అందమైన ఫోటోల‌ను షేర్ చేసింది. చాలా తెలివైన మ‌లైకా ఒక ఏడాది ఎదిగేసింది. ఈ సంవ‌త్స‌రాలు క‌చ్చితంగా సంతోషంగా ఉంటుంది. ప్ర‌తిసారీ ఆత్మపరిశీలన చేసుకోవాలి'' అని వ్యాఖ్య‌ను జోడించింది.

మలైకా అరోరా తదుపరి కొత్త రియాలిటీ షోలో 'మూవింగ్ ఇన్ విత్ మలైకా'లో కనిపించనుంది. ఈ కార్యక్రమం డిసెంబర్ 5 నుండి డిస్నీ+హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.