Begin typing your search above and press return to search.

ఈ భామ వర్కౌట్ వీడియో చూస్తే కుర్రాళ్లు ఫిదా కావాల్సిందే..!

By:  Tupaki Desk   |   24 March 2021 1:30 PM GMT
ఈ భామ వర్కౌట్ వీడియో చూస్తే కుర్రాళ్లు ఫిదా కావాల్సిందే..!
X
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు సినిమాల పరంగా ఎంత మంచి ఫ్యాన్ బేస్ కలిగి ఉంటారో.. బయట వారి లైఫ్ స్టైల్ బట్టి అదే రేంజిలో ఫాలోయింగ్ కలిగి ఉంటారు. నిజానికి సెలబ్రిటీల లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం చాలా కష్టం. వారు సినిమాకోసం క్యారెక్టర్ డిమాండ్ మేరకు వాళ్ల శరీరాకృతిని ఎలాగైనా మలుచుకోడానికి సిద్ధంగా ఉంటారు. అందం పరంగా ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో ఫిజిక్ పరంగా కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటారు. బాలీవుడ్ స్టార్ మలైకా అరోరా.. గురించి సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన లేదు. ఎందుకంటే ఆమె తన సినిమాలతో, ముఖ్యంగా ఆమె పాటలతో సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

మలైకా ఎంత అందగత్తె అనేది అందరికి తెలిసిందే. తెలుగులో కూడా మలైకా స్పెషల్ సాంగ్స్ తో ఓ ఊపు ఊపేసింది. ఆ విధంగానే ఆమె అందాలను ఆరాధించే అభిమానులు మిలియన్స్ సంఖ్యలో ఉన్నారు. మలైకా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. అందుకే ఆమెకు సంబంధించిన విషయాలను, ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా మలైకా వర్కౌట్స్ చేస్తున్న వీడియో ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఆ వీడియోలో మలైకా తన ట్రైనర్ తో కలిసి పోటాపోటీగా వర్కౌట్స్ చేస్తోంది. నలభై ఏడేళ్ల వయసులో కూడా మలైకా.. కుర్ర హీరోయిన్ల‌తో స‌మానంగా క్రేజ్ దక్కించుకుంటోంది. ఇప్పుడు ఫామ్ లో ఉన్న హీరోయిన్లు కుళ్ళుకునే విధంగా ఫిజిక్ మెయింటైన్ చేస్తుందంటే అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం మలైకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.