Begin typing your search above and press return to search.

ప‌ప్పీతో షికార్ కెళ్లినా బ్రాండ్ లో ఎక్క‌డా త‌గ్గ‌ని మ్యామ్?

By:  Tupaki Desk   |   6 Nov 2020 1:30 AM GMT
ప‌ప్పీతో షికార్ కెళ్లినా బ్రాండ్ లో ఎక్క‌డా త‌గ్గ‌ని మ్యామ్?
X
బాలీవుడ్ హాటెస్ట్ ఐటెమ్ గాళ్ గా మ‌లైకా అరోరాఖాన్ పాపులారిటీ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఇండ‌స్ట్రీ బెస్ట్ డ్యాన్సింగ్ ట్యాలెంట్ తో మ‌లైకా ద‌శాబ్ధంన్న‌ర సీజ‌న్ ని ఒక ఊపు ఊపింద‌నే చెప్పాలి. అదే ట్యాలెంట్ తో టాలీవుడ్ కోలీవుడ్ లోనూ మ‌లైకా వీరాభిమానుల్ని సంపాదించుకుంది.

ఇక‌పోతే మ‌లైకా ఎఫైర్ వ్య‌వ‌హారం స‌హా విడాకులు ఇటీవ‌ల సంచ‌ల‌న‌మైంది. ప్ర‌స్తుతం అర్జున్ క‌పూర్ తో డేటింగ్ లో ఉన్నారు మ‌లైకా. మ‌రోవైపు నిరంత‌రం ఇన్ స్టాలో ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ అభిమానుల‌లో హీట్ పెంచుతున్న తార‌గా మ‌లైకా పాపుల‌రైంది. 47 ఏళ్ల మ‌లైకా ఇంత లేట్ ఏజ్ లోనూ త‌న‌దైన ఫ్యాష‌న్ అండ్ స్టైల్స్ తో అద‌ర‌గొడుతున్న తీరు యువ‌త‌రంలో నిరంత‌రం హాట్ టాపిక్. ప‌ర్ఫెక్ట్ ఫిజిక్ తో ఇండ‌స్ట్రీ హాటెస్ట్ గాళ్ గా ఇప్ప‌టికీ త‌న స్థానానికి డోఖా లేకుండా త‌న హార్డ్ వ‌ర్క్ నిరంత‌రం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే ఉంది.

లేటెస్టుగా మ‌లైకా అన్ నోన్ ఫ్రెండు కాస్ప‌ర్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇటీవ‌ల ప్ర‌తిరోజూ వేకువ ఝామున ఆరుబ‌య‌ట కాస్ప‌ర్ తో క‌లిసి షికార్ కి వెళుతున్న మ‌లైకా బ్రాండెడ్ దుస్తుల్ని మాత్రం విడిచిపెట్ట‌డం లేదు. బ్రాండెడ్ స్పోర్ట్ డ్రెస్ లు ట్రాక్ సూట్ల తో అద‌ర‌గొట్టేస్తోంది.

గురువారం ఉదయం ఫిట్‌నెస్ ఔత్సాహికురాలైన మ‌లైకా తన కుక్క కాస్పర్ ను బాంద్రా పరిసరాల్లో చుట్టూ వాకింగ్ కి తిప్ప‌డం జ‌నాల కంట ప‌డింది. మోర్నింగ్ వాక్ లో మ‌లైకా ఫ్రెండు కంటే ఆక‌ర్షించిన విష‌యం ఒక‌టి ఉంది. అదే బ్రాండ్ ప‌బ్లిసిటీ.. దానిపైనే అంతా మాట్లాడుకున్నారు. అలాగే మలైకా తన పెంపుడు జంతువుతో తన స్నేహానికి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేసి అబ్బుర‌ప‌రిచింది. ఉదయం ఇంట్లో చుట్టూ తిరిగేటప్పుడు ఆమె తన పెంపుడు జంతువు కాస్పర్ వెనుక దాక్కున్న ఫోటోల్ని ఇటీవ‌ల మ‌లైకా షేర్ చేశారు. తాజాగా వీధిలో షికార్ చేస్తూ త‌న లుక్కు విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌క‌పోవ‌డం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది.

కరోనావైరస్ నుండి కోలుకున్న తర్వాత మలైకా తిరిగి రియాలిటీ షోలు స‌హా షూటింగుల‌కు సిద్ధ‌మైంది. ఆన్ లొకేష‌న్ సంద‌డి షురూ చేసిన ఫోటోలు వీడియోలు ఇంత‌కుముందు వైర‌ల్ అయ్యాయి. కొరియోగ్రాఫర్స్ టెరెన్స్ లూయిస్ .. గీతా కపూర్లతో కలిసి డ్యాన్స్ రియాలిటీ షోకు జ‌డ్జిగా తీర్పు వెలువ‌రించింది. ఆమె ఇన్ ‌స్టాగ్రామ్ ‌లో ఫోటోలను పంచుకోవడంతో షో నుండి వచ్చిన మలైకా దుస్తులను తరచుగా సోషల్ మీడియాను తుఫాన్ వేగంతో చుట్టేశాయి. అభిమానులు ఆమె శైలిని చూసి ఆశ్చర్యపోవ‌డం రివాజు.