Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: సాగ‌ర‌క‌న్య‌తో మలైకం స్నేహం

By:  Tupaki Desk   |   27 July 2021 5:25 AM GMT
ట్రెండీ టాక్‌: సాగ‌ర‌క‌న్య‌తో మలైకం స్నేహం
X
డ్యాన్సింగ్ క్వీన్స్ .. స్టైలిష్ యోగా క్వీన్స్ గా.. ఆ ఇద్ద‌రూ ఒకరితో ఒక‌రు పోటీప‌డ‌తారు. మేటి ఐటమ్ గాళ్స్ గానూ ఆ ఇద్ద‌రూ టాప్ స్లాట్ లో నిలిచిన వారే. పెళ్లి త‌ర‌వాతా లైఫ్ ఎంట‌ర్ టైన్ మెంట్ ని ఎక్క‌డా మిస్ కాలేదు ఈ భామ‌లు. డ్యాన్స్ రియాలిటీ షోల‌కు జడ్జీలుగా హిందీ చానెళ్ల‌లో గొప్ప గౌర‌వం అందుకుంటున్నారు. ఇక ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో ఎదురే లేని రాణులుగానూ వెలిగిపోతున్నారు ఈ స్నేహితురాళ్లు.

మలైకా అరోరా- శిల్పా శెట్టి కుంద్రా వేర్వేరు కెరీర్ గ్రాఫ్ లు కలిగి ఉన్నా కొన్నిటిలో సారూప్యత‌ల్ని క‌లిగి ఉన్నారు. వారి ఇమేజ్ దృష్ట్యా బాలీవుడ్ లో పూర్తిగా భిన్నమైన అభిమానులు ఉన్నారు. ఆ ఇద్ద‌రిలో ఉన్న కామ‌న్ ఎలిమెంట్ ఫిట్ నెస్ పై వారికున్న ప్రేమ. బాలీవుడ్ హాట్ మమ్మీలు ఫిట్ నెస్ ప్రియులు గా నిరంతరం సోషల్ మీడియా పోస్టులతో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటారు.

తాజాగా ఆ ఇద్ద‌రూ ఒకే ఫ్రేమ్ లో ఉన్న అరుదైన‌ త్రోబాక్ ఫోటో వైర‌ల్ గా మారింది. నిజానికి ఈ ఫోటో శిల్పాజీ బ‌ర్త్ డే పార్టీలోనిది. ప్ర‌తిసారీ ఫంక్ష‌న్లు పార్టీలు ఉన్నాయి అంటే గాళ్స్ గ్యాంగ్ సంద‌డి వేరే లెవ‌ల్లో ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ గ్యాంగ్ కి మ‌లైకా శిల్పాజీ క‌రిష్మా క‌పూర్ లాంటి వాళ్లు కీల‌క లీడ్ స‌భ్యులుగా ఉన్నారు.

అయితే ఇటీవ‌ల శిల్పాశెట్టి హ‌బ్బీ డ‌ర్టి పిక్చ‌ర్ స్కాం రివీల‌య్యాక మ‌రోమారు ఈ త్రోబ్యాక్ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. ఈ ఫోటోలో మలైకా మిర్రర్ వర్క్స్ తో బ్యాక్ లెస్ షార్ట్ డ్రెస్ లో కిల్ల‌ర్ లుక్ తో క‌ట్టి ప‌డేస్తోంది. శిల్పాశెట్టి ఎప్పటిలాగే మెరుపుల థై స్లిట్ గౌనులో అందంగా కనిపించింది. మలైకా కెమెరా వైపు రెప్ప వేయ‌కుండా ఫోజులివ్వ‌గా.. శిల్ప అందంగా న‌వ్వుతూ క‌నిపిస్తున్నారు.

ఈ కరోనావైరస్ లాక్డౌన్ సమయంలో స‌ద‌రు నటీమణులు ఇద్దరూ ఇంట్లో తమ ఖాళీ సమయాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నిరంత‌రం రోజువారీ వ్యాయామాలను కొనసాగించడమే కాకుండా.. వారు తమ కుటుంబం ప్రియమైనవారితో కూడా నాణ్యమైన సమయాన్ని వెచ్చిస్తున్నారు. మహమ్మారి సమయంలో తమ అభిమానులతో ఇంటరాక్ట్ చేయడానికి అలరించడానికి వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ ను విరివిగా ఉపయోగిస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. శిల్పా త్వరలో `నిక్కమ్మ`గా తిరిగి రాబోతుంది. ఈ చిత్రంలో అభిమన్యు దాసానీ .. షిర్లీ సెటియా ప్రధాన పాత్రల్లో నటించారు. ‘హంగామా 2’ లో కూడా కనిపించనుంది. అక్కడ ఆమె పరేష్ రావల్.. ప్రణీత సుభాష్.. మీజాన్ జాఫ్రీలతో ప్రధాన పాత్రల్లో స్క్రీన్ స్పేస్ పంచుకుంటుంది. మ‌రోవైపు మ‌లైకా వ‌రుస‌గా డ్యాన్స్ రియాలిటీ షోలు చేస్తూ బిజీగా ఉన్నారు. ర్యాంప్ షోల‌తోనూ నాలుగు చేతులా ఆర్జిస్తున్నారు.