Begin typing your search above and press return to search.

కుక్క‌ను మించిన నేస్తం లేడ‌‌ని తెలుసుకుంది

By:  Tupaki Desk   |   5 Nov 2020 5:40 PM IST
కుక్క‌ను మించిన నేస్తం లేడ‌‌ని తెలుసుకుంది
X
కుక్క‌ను మించిన నేస్తం లేదు. అందుకే ఇంట్లో ప‌ప్పీని పెంచుకునేందుకు అంతా ఆస‌క్తిని చూపిస్తారు. మాన‌వ సంబంధాల్లో విలువ‌లు త‌గ్గే కొద్దీ మూగ జీవాల‌తో స్నేహం పెరుగుతోంది. ఒక ర‌కంగా అమాయ‌క ‌జీవాల‌తో స్నేహం అన్నిర‌కాలుగా మేలు చేస్తోంద‌ని స్ట‌డీస్ చెబుతున్నాయి. తీవ్ర‌మైన ఒత్తిడి భారిన ప‌డే మ‌నుషుల‌కు మెడిసిన్ లా పప్పీల‌తో స్నేహం ఉప‌యోగ‌ప‌డుతోంద‌న్న‌ది తాజా సైంటిఫిక్ స‌ర్వే చెబుతోంది.

ఇదిగో అలా కుక్క‌లంటే ప్రాణం పెట్టే సెల‌బ్రిటీల్లో మలైకా కూడా చేరిపోయింది. ఈ భామ లైఫ్ జ‌ర్నీ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇక లైఫ్ స్టైల్ విష‌యంలో మ‌లైకా ఎంద‌రికో స్ఫూర్తి. రెగ్యుల‌ర్ జిమ్ యోగాతో ప‌ర్ఫెక్ట్ ఫిట్ నెస్ మెయింటెయిన్ చేస్తూ 50 ఏజ్ కి చేరువ‌లోనూ స‌ర్ ప్రైజ్ చేస్తోందిలా.

మ‌లైకా తన పెంపుడు కుక్కతో షికార్ అంటే ఎంతో ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. ఇదిగో ఇలా నిన్న‌టిరోజున‌ చ‌ల్ల‌ని సాయంత్రం అలా షికార్ బ‌య‌ల్దేరారిలా. తన పెంపుడు కుక్కతో బయలుదేరినప్పుడు కూల్ గా ఎంతో క్యాజువల్ అవతార్ లో క‌నిపించారు మ‌లైకా. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఆమె పెంపుడు జంతువును నడక కోసం బయటకు తీసుకెళ్లడం ఆక‌ర్షిస్తోంది.

షారుఖ్ ఖాన్ చిత్రం దిల్ సే తెలుగులో ప్రేమ‌తో పేరుతో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. నాటి నుంచి చ‌య్య చ‌య్యా.. భామ‌గా పాపుల‌రైంది. సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ నుండి మున్నీ బద్నామ్ హుయ్ లో మ‌లైకాకు మ‌రో చార్ట్ బస్టర్. ప‌వ‌న్ క‌ల్యాణ్ `గ‌బ్బ‌ర్ సింగ్` లో కెవ్వు కేక ఐటెమ్ నంబ‌ర్ తోనూ మ‌రోసారి మ‌లైకా స‌త్తా చాటింది. మలైకా అరోరా అద్భుతమైన నృత్య నైపుణ్యానికి తెలుగు నాటా వీరాభిమానులున్నారు. నిరంత‌రం హిందీ బుల్లితెర‌పై డ్యాన్స్ రియాలిటీ షోలలో న్యాయమూర్తిగానూ పాపులారిటీని పెంచుకున్న‌ మలైకా అరోరా రెగ్యుల‌ర్ ఫ్యాషన్ స్టేట్మెంట్లతో తలలు తిప్పి చూసేలా చేస్తున్నారు.