Begin typing your search above and press return to search.

పెంపుడు కుక్క కోస‌మే మ‌లైకా అలా చేస్తోంద‌ట‌

By:  Tupaki Desk   |   24 May 2021 4:30 AM GMT
పెంపుడు కుక్క కోస‌మే మ‌లైకా అలా చేస్తోంద‌ట‌
X
మ‌హ‌మ్మారీ సెకండ్ వేవ్ కారణంగా చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు స్వీయ‌నిర్బంధంలో ఉన్నారు. ఇంటిని విడిచి బ‌య‌ట‌కు రావడానికి ఇష్ట‌ప‌డ‌డం లేదు. కానీ ఫ్యాష‌నిస్టా మలైకా అరోరా తన పెంపుడు కుక్క కోసం ప్రతి రోజూ ఉదయాన్నే స్వచ్ఛమైన గాలిని అందించేందుకు ఆరుబ‌య‌ట‌కు రావ‌డం కంట ప‌డుతోంది. ఇప్ప‌టికే అరోరా రెగ్యుల‌ర్ ఫోటో ట్రీట్ అభిమానుల‌కు సుప‌రిచిత‌మే.

తన పెంపుడు కుక్క కాస్పర్ తో కలిసి ఈ ఆదివారం కూడా మ‌లైకా ఆరుబయట వీధిలోకి వచ్చింది. రెగ్యుల‌ర్ వ్యాయామాలను చాలా అరుదుగా కోల్పోయే మలైకా సండే షికార్ లో ఎప్ప‌టిలానే సూపర్ ఫిట్ గా కనిపించారు.

యోగా ఔత్సాహికురాలైన మ‌లైకా స్పెష‌ల్ స్పోర్ట్ లుక్ లో క‌నిపించారు. క్రిమ్సన్ రెడ్ క్రాప్ టాప్ .. బ్లాక్ షార్ట్స్.. టైట్స్ ధరించి కనిపించారు. మలైకా మాస్క్ మ్యాట‌ర్ లోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఇక ఆ కాళ్ల‌కు వైట్ రీబాక్ చెప్పులు ప్ర‌తిరోజూ ద‌ర్శ‌న‌మిస్తూనే ఉన్నాయి.

ఇక మ‌లైకా వ్య‌క్తిగ‌త జీవితం తెరిచిన పుస్త‌కం లాంటిది. యువ‌హీరో అర్జున్ క‌పూర్ తో మలైకా అనుబంధం తెలిసిన‌దే. అత‌డితో ఈ జీవితం చాలా సంతోషంగానే ఉంద‌ని మ‌లైకా తెలిపారు. పెళ్లి అవ‌స‌రం గురించి ప్ర‌స్థావించేందుకు ఆమె ఇష్ట‌ప‌డ‌లేదు.

అర్జున్ ని ప్ర‌తిసారీ పెళ్లి గురించి ప్ర‌శ్నిస్తే.. చాలా గ‌మ్మ‌త్త‌యిన రెస్పాన్స్ ఇస్తుంటాడు. నేను నా వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా మాట్లాడటానికి ప్రయత్నించను. ఎందుకంటే మీరు మీ భాగస్వామిని గౌరవించాలని నేను భావిస్తున్నాను. అక్కడ ఒక గతం ఉంది .. నేను పరిస్థితులను చూశాను.. పిల్లలు ప్రభావితం అవుతారు కాబ‌ట్టి ఇది మంచిది కాదు. ఎందుకంటే నేను గౌరవప్రదమైన హ‌ద్దుల్ని పాటిస్తాను. ఆమె సౌకర్యవంతంగా ఉన్నారా లేదా అన్న‌ది నేను చేస్తాను. అలాగే నా కెరీర్ నా సంబంధాన్ని అంటిపెట్టుకోకూడదు. కాబట్టి మీరు కూడా సరిహద్దులను నిర్ణ‌యించుకోవాలి`` అంటూ మీడియాకి క్లాస్ తీస్కున్నారు.