Begin typing your search above and press return to search.

మ‌లైకాను తాకిన క‌రోనా.. అస‌లేం జ‌రుగుతోంది?

By:  Tupaki Desk   |   4 March 2020 2:30 PM GMT
మ‌లైకాను తాకిన క‌రోనా.. అస‌లేం జ‌రుగుతోంది?
X
క‌రోనా చుట్ట‌బెట్టేస్తోంది. ప్ర‌పంచాన్ని గ‌జ‌గ‌జ ఒణికిస్తోంది. ఇప్ప‌టికే దిల్లీ వ‌ర్గాలతో పాటు ఏపీ- తెలంగాణ ప్ర‌భుత్వాలు ఆల్మోస్ట్ డేంజ‌ర్ అలార్మ్ మోగించాయి. ఒకేసారి ప్ర‌జ‌ల్ని భ‌య‌పెట్టేయ‌కుండా నెమ్మ‌దిగా ప‌రిస్థితిని వివ‌రించి చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. క‌రోనా వైర‌స్ డిసీజ్ 2019 (కోవిడ్ -19) చైనా వుహాన్ నుంచి ప్ర‌పంచం అంతా తిరిగేస్తోంద‌న్న‌ది క‌న్ఫామ్ అయ్యింది.

ఈ స‌న్నివేశంలో సెల‌బ్రిటీలు విదేశీ ప్ర‌యాణాల్ని క్యాన్సిల్ చేసుకుంటుండ‌డం చూస్తుంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ప్యారిస్ ఫ్యాష‌న్ వీక్ కి వెళ్లేందుకు సిద్ధ‌మైన దీపిక అనూహ్యంగా విమాన ప్ర‌యాణాన్ని క్యాన్సిల్ చేసుకుంది. కాస్త డేర్ చేసి డార్లింగ్ ప్ర‌భాస్ ఫ్రాన్స్ బ‌య‌ల్దేర‌డంపైనా అభిమానులు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. అన‌వ‌స‌ర‌మైన రిస్క్ చేస్తున్నాడా డార్లింగ్ అని సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇక వీళ్ల సంగ‌తి ఇలా ఉంటే.. మరోవైపు విమానాశ్ర‌యాల్లో హై ఎలెర్ట్ ఎలా ఉందో వివ‌రిస్తూ మ‌లైకా షేర్ చేసిన ఎమోటికాన్స్ యువ‌త‌రంలో చ‌ర్చ‌కు తావిచ్చాయి. విమానాశ్ర‌యంలో ముసుగు జ‌నాల్ని చూడ‌లేక‌పోతున్నాం బాబోయ్ అంటూ వ్యంగ్యంగా మూడు మంకీస్ ఎమోటికాన్స్ ని మ‌లైకా పోస్ట్ చేసింది. విమానాశ్ర‌యాల్లో హై అలెర్ట్ ఎలా ఉందో తాజా స‌న్నివేశం చెబుతోంది. ఇక మ‌లైకా ఎమోటికాన్ ప్ర‌మోష‌న్ కూడా జ‌నాల్లోకి వైర‌ల్ గానే దూసుకెళుతోంది. ఇక క‌రోనా తెలంగాణ‌లోనూ ప్ర‌వేశించింది .. గెట్ రెడీ ఫ‌ర్ ట్రీట్ అంటూ చిలిపిత‌నం ప్ర‌ద‌ర్శించిన ఛార్మిలా .. మ‌లైకా మ‌రీ అంత చెత్త ప‌ని చేయ‌లేద‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.