Begin typing your search above and press return to search.

మ‌లైకం మ‌త్తుగా చిత్తుగా మైకం క‌మ్మేలా

By:  Tupaki Desk   |   11 Jan 2021 12:10 PM IST
మ‌లైకం మ‌త్తుగా చిత్తుగా మైకం క‌మ్మేలా
X
బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ .. పూల్ సైడ్ ట్రీట్ అంటే చెల‌రేగిపోవ‌డం మ‌లైకా అరోరా ఇస్ట‌యిల్. గ‌త కొంత‌కాలంగా గోవా బీచ్ సెల‌బ్రేష‌న్ కి సంబంధించిన ఫోటోల్ని మ‌లైకా ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేస్తోంది. త‌న సోద‌రి అమృత అరోరా కి చెందిన‌ 5 బీహెచ్ కే గోవా విల్లాలో ప్రియుడు అర్జున్ క‌పూర్ తో క‌లిసి మ‌లైకా న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్ ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ విలాసాల విల్లాలో ఈత కొల‌ను చెంత నిరంత‌ర యోగాభ్యాసానికి సంబంధించిన ఫోటోల‌ను .. అర్జున్ తో రొమాంటిక్ విన్యాసాల్ని.. ఇత‌ర ఫోటోషూట్ల‌ను మ‌లైకా షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అయ్యాయి. తాజాగా ఈ సెల‌బ్రేష‌న్ నుంచి ఓ అరుదైన ఫోటోని రివీల్ చేసింది మ‌లైకా.

విల్లా ప‌రిస‌రాల్లో సువిశాల‌మైన స్విమ్మింగ్ పూల్ చెంత రిలాక్స్ డ్ గా వైన్ సేవిస్తున్న మ‌లైకా ఫోటో అగ్గి రాజేస్తోంది. మ‌లైకం మ‌త్తుగా చిత్తుగా గ‌మ్మ‌త్తుగా! అంటూ యూత్ ఒక‌టే ప‌రేషాన్ అయిపోతున్నారు. ఇప్ప‌టికే న్యూఇయ‌ర్ లో గాళ్స్ గ్యాంగ్ తోనూ చేరి మ‌లైకా ర‌చ్చ చేస్తున్న ఫోటోలు మ‌రోవైపు అంత‌ర్జాలంలో షేక్ చేస్తున్నాయి. ఈ గ్యాంగ్ లో క‌రీనా.. అమృత స‌హా ప‌లువురు భామ‌లు ఉన్నారు. క‌రిష్మా ఈసారి గ్యాంగ్ లో చేర‌డం కుద‌ర‌క‌ మిస్స‌య్యారు.