Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఆమె థై షోస్ కి ఎర్త్ షేకింగ్‌

By:  Tupaki Desk   |   2 Dec 2020 10:18 AM IST
ఫోటో స్టోరి: ఆమె థై షోస్ కి ఎర్త్ షేకింగ్‌
X
అందంగా ఉంటే స‌రిపోదు. ఆ అందాన్ని అంతే అందంగా ఎలివేట్ చేయాలి. అప్పుడే ఆ అందానికి మార్కులు ప‌డ‌తాయి ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో. నియాన్ కాంతుల నడుమ చీక‌టి రేతిరిలో రెడ్ కార్పెట్ న‌డ‌క‌లతో హంసలా హొయ‌లు పోవ‌డం అంత వీజీ అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్టే. ఈ రంగంలో సుదీర్ఘ అనుభ‌వం ఘ‌డించిన మ‌లైకా లాంటి వాళ్ల‌ను న‌వ‌త‌రం స్ఫూర్తిగా తీసుకుంటేనే అలాంటి గొప్ప గ్లామ‌ర్ రంగంలో రాణించ‌డం సాధ్యం.

47 వ‌య‌సు మలైకా అరోరా ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్ కి టీనేజ‌ర్లు 60 ప్ల‌స్ ఏజ్ గ్రూప్ అయినా టెంప్ట్ అవ్వాల్సిందే. అంత‌గా ఆమె లుక్ మెయింటెయిన్ చేస్తుంది. ఆ న‌డ‌క న‌డ‌త చూసే చూపు ప్ర‌తిదీ సంథింగ్ స్పెష‌ల్. ఇక మ‌లైకా హ‌స్కీ వాయిస్ కి ఫ్యాన్సున్నారు. 32 ఏళ్ల కుర్రాడు అర్జున్ కి ఆమె అంటే అంత ప్రేమ ఎందుకు? అంటే ఆ ప్ర‌శ్న‌లోనే స‌మాధానం దాగి ఉంది.

మ‌లైకా ముంబై నగరంలో అడుగు పెట్టగానే స్టైలిష్ వైట్ టీస్ లో థై సొగ‌సుల్ని ఎలివేట్ చేసే దుస్తులలో తలలు తిప్పేలా చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. ఇక ఈ త‌ర‌హా లుక్ ఇదే తొలిసారి కాదు. ఇంత‌కుముందు తన పెంపుడు జంతువుతో వేకువ‌ఝామున‌ నడకకు వెళ్ళడం నుండి యోగా క్లాసులకు వెళ్ళడం వరకు మలైకా తరచుగా కెమెరా కంటికి చిక్కుతూనే ఉంది. ప్ర‌తిసారీ ఏదో ఒక కొత్త‌ద‌నం అందాల ఎలివేష‌న్ త‌న‌కే సాధ్యం. ప్రతిసారీ ఆమె ఫ్యాషన్ ప్రియుల్ని అభిమానుల్ని ఆకట్టుకుంటుంది.

ఈసారి కూడా స్టైలిష్ వైట్ టీ డ్రెస్ లో సంథింగ్ స్పెష‌ల్ గా హాట్ గా క‌నిపిస్తోంది. చురుకైన న‌డ‌క తీరు.. కాళ్ల‌కు ఆ గోధుమ మడమ బూట్లతో తెగ క‌వ్వించేస్తోంది. ఆమె టోన్డ్ కాళ్ళ మెరుపులు మురిపించేస్తున్నాయ్. COVID 19 మహమ్మారి మధ్య మలైకా బ్లాక్ మాస్క్ కూడా ధ‌రించింది మ‌లైకా. కెరీర్ ప‌రంగా చూస్తే మ‌లైకా ప్ర‌స్తుతం ప్ర‌ముఖ చానెల్లో పాపుల‌ర్ డ్యాన్స్ రియాలిటీ షో జ‌డ్జిగా కొన‌సాగుతోంది.