Begin typing your search above and press return to search.

'పెట్ డాగ్'తో బయటికి వచ్చిన స్టార్ సెలబ్రిటీ.. ఫోటోస్ వైరల్!

By:  Tupaki Desk   |   1 May 2021 2:30 PM GMT
పెట్ డాగ్తో బయటికి వచ్చిన స్టార్ సెలబ్రిటీ.. ఫోటోస్ వైరల్!
X
బాలీవుడ్ సినీతార మలైకా అరోరా.. అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఎందుకంటే ఆమె సౌత్ ప్రేక్షకులకు ఎంత స్పెషల్ అనేది స్టార్ హీరోల సినిమాలు చెబుతాయి. మలైకా అటు నుండి ఇటు సౌత్ ఇండస్ట్రీల వరకు స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్ గా చాలా ఫేమస్. ఆమె చేసిన ఎన్నో మాంచి మసాలా సాంగ్స్ సినిమాల విజయాలకు ఎంతో హెల్ప్ అయ్యాయి. నిజంగా మలైకా ఓ అందాలరాశి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె అందంతో పాటు ఎల్లప్పుడూ ఫిట్నెస్ కు ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే తోటివారికీ, జూనియర్ హీరోయిన్లకు ఫిట్నెస్ విషయంలో ఆదర్శంగా నిలుస్తుంది. అమ్మడు సినిమాల విషయానికి వస్తే అందాలతో ఎంత రచ్చలేపుతుందో బయట చూస్తే అంతే కామ్ అండ్ కూల్ గా ఉంటుంది.

ప్రస్తుతం ముంబైలో కరోనా కోరలు చాచడంతో వేలసంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలసంఖ్యలో కరోనా బాధితులుగా మారుతున్నారు. ఇలాంటి తరుణంలో ముంబైలో నైట్ టైంలో కర్ఫ్యు అమలులో ఉంది. అయితే తాజాగా మలైకా కరోనా నిబంధనలు పాటిస్తూ తన పెట్ డాగ్ తో వాకింగ్ చేయడానికి బయటికి వచ్చింది. చాలా క్యాజువల్ డ్రెస్ లో మాస్క్ ధరించి అమ్మడు వాకింగ్ చేసి వెళ్లిందని సమాచారం. ప్రస్తుతం మలైకా పెట్ తో వాకింగ్ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఓవైపు మలైకా ఇంటిపట్టునే ఉంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా కరోనా బాధితులకు అవగాహనా కల్పించే ప్రయత్నం కూడా చేస్తుందని ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మలైక్ ఏ సినిమాలోను కనిపించలేదు.