Begin typing your search above and press return to search.

యాభైలో ఇర‌వై చూపిస్తున్న మ‌లైకా

By:  Tupaki Desk   |   26 Feb 2022 10:03 PM IST
యాభైలో ఇర‌వై చూపిస్తున్న మ‌లైకా
X
యాభైకి చేరువ అవుతున్నా మ‌లైకాలో ఇసుమంత స్పీడ్ కూడా త‌గ్గ‌లేదు. ఇప్ప‌టికీ ట్వంటీ ప్ల‌స్ మాత్ర‌మే అన్నంత ఎన‌ర్జీతో రెచ్చిపోతోంది. ఇక నిరంత‌రం మ‌లైకా ఫోటోషూట్లు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తూనే ఉన్నాయి. మ‌లైకా బోల్డ్ ఫోటోషూట్స్ కి ఫ్యాన్స్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. ఇప్ప‌టికే ఇన్ స్టాలో భారీ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది అంటే మ‌లైకాలోని ఈ గ‌ట్ ఫీలింగే కార‌ణం.

ఇంత‌కుముందు ఫ‌ర్హాన్- శిబానీ పెళ్లి విందులో బికినీ ఫ్రాక్ లో క‌నిపించి మ‌తులు చెడ‌గొట్టింది. దీనికి తీవ్ర‌మైన‌ ట్రోల్స్ ఎదుర‌య్యాయి. కానీ ఇప్పుడు అంత‌కుమించి అనే రేంజులో చెల‌రేగిపోయింది. మ‌లైకా వైట్ టాప్ బ్లాక్ బాట‌మ్ ని ధ‌రించి అలా సెల్ ఫోన్ లో నిమ‌గ్న‌మై క‌నిపిస్తోంది. అయినా చ‌క్క‌న‌మ్మ అలా ఆద‌మ‌రిస్తే అంతేగా! అంటూ కామెంట్లు ప‌డిపోతున్నాయ్.

ఆదాయం ఆ రేంజులోనే..!

మ‌లైకా నిరంత‌రం వేడెక్కించే ఫోటోలు వీడియోల‌ను షేర్ చేయ‌డం వెన‌క చాలా లాజిక్ క్యాలిక్యులేష‌న్ ఉంది. కోట్లాదిగా ఫాలోవ‌ర్స్ ని పెంచుకునే ఎత్తుగ‌డ ఇది. ఒక్కో క్లిక్ కి ల‌క్ష‌ల‌లో లైక్ ల‌కు బోలెడంత ఆదాయం ఆర్జిస్తోంది మ‌లైకా. అయితే నెటిజ‌నుల్ని కంటిన్యూగా అల‌రించాలంటే అంత ఆషామాషీ కాదు. కానీ మ‌లైకాకు ఆ ట్రిక్ ఏంటో బాగా తెలుసు. నిరంత‌రం త‌న ఎద అందాల‌ను ఆవిష్క‌రిస్తూ లేదా థై షోస్ చేస్తూ చిట్టి పొట్టి నిక్క‌ర్ల‌లో వేడెక్కిస్తూ ఈ భామ చేసే హ‌డావుడి అంతా ఇంతా కాదు. ఆ ఫోటోలు నెట్ లో సునామీ స్పీడ్ తో దూసుకుపోతూనే ఉన్నాయి.

లేటెస్ట్ ఫోటోషూట్ల‌తో నిరంత‌రం మ‌లైకాకు సోష‌ల్ మీడియాల్లో ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది. ఇలా ల‌క్ష‌ల్లో లైక్ లు క్లిక్ ల‌తో సోష‌ల్ మీడియా ఆదాయం బాగానే పెంచుకుంది. కుర్ర‌జ‌నం ఈ హాట్ ఆంటీ గారి ఫోటోగ్రాఫ్స్ కి ఫిదా అయిపోతూ బాగానే చిల్ అవుతున్నారు. రియాలిటీ షోలు త‌గ్గినా సోష‌ల్ మీడియా షోల‌తో ఈ అమ్మ‌డు బాగానే ఆర్జిస్తోంది మ‌రి.