Begin typing your search above and press return to search.

క్రిస్మ‌స్ గిఫ్ట్ అదిరెను.. మలైకా అరోరా కిల్ల‌ర్ లుక్

By:  Tupaki Desk   |   16 Dec 2021 11:00 PM IST
క్రిస్మ‌స్ గిఫ్ట్ అదిరెను.. మలైకా అరోరా కిల్ల‌ర్ లుక్
X
ఇది క్రిస్మస్ సీజన్ .. అయితే క్రిస్మస్ కానుక ఏమిటీ? అంటే.. మలైకా అరోరా ఇదిగో ఇలా చెల‌రేగిపోయింది. తాజా ఫోటోషూట్ లో  సిల్వర్ మినీ డ్రెస్ లో పోజులిచ్చింది. ఆమె స్మోకింగ్ హాట్ లుక్ యువ‌త‌రంలో హాట్ టాపిగ్గా మారింది.

జిమ్ లుక్ వేరు.. టైట్ ట్రాక్ ల‌లో ఎంత హాట్ గా కనిపిస్తుందనే దానిపైనే అందరి దృష్టి ఉంది. ఆ టోన్ బాడీ చాలామందికి అసూయ కలిగిస్తుంది. ఇక్కడ ఆమె తన టోన్డ్ బ్యాక్ లుక్ కిల్ చేస్తోంది. మలైకా అరోరాతో కలిసి పనిచేసే మేనకా హరిసింఘానికి ఆమె ప్రో లా ఈ ఫోటోల‌ను రెడీ చేసింది. ఈ క్రిస్మ‌స్ సీజన్ లో ఇలాంటి గ్లింప్స్ ఇంకా మ‌రోన్నో తార‌ల నుంచి ఆశించ‌వ‌చ్చు..

40 ప్ల‌స్ ఏజ్ లోనూ మ‌లైకా 20 ఏళ్ల అమ్మాయిగా రెచ్చిపోతున్న తీరు షాకిస్తోంది. మలైకా అరోరా తన స్టైల్ కంటెంట్ ని ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. హాట్ బాడీతో ఏ టీనేజర్ కి అయినా త‌గ్గ‌డం లేదు. మలైకా అరోరా కొన్ని నెలల క్రితం పరీక్షలో క‌రోనా పాజిటివ్ వచ్చిన తర్వాత దాదాపు 12 రోజుల పాటు తన డ్యాన్స్ షోకి దూరంగా ఉంది. క‌రోనా తేలికపాటి లక్షణాలను కలిగి ఉండ‌డంతో ఇంట్లోనే చికిత్స‌తో కోలుకుంది.

ఆమె సోదరి అమృతకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలినప్పటికీ త‌ను కూడా చికిత్స‌తో బ‌య‌ట‌ట‌ప‌డింది.  ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ సెట్స్ పైకి తిరిగి వచ్చింది. ఆమె BFF కరీనా కపూర్ ఖాన్ కూడా పాజిటివ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

మలైకా అరోరా అద్దాలకు వ్యతిరేకంగా పోజులిచ్చే షూట్ కాన్సెప్ట్ యూత్ లోకి దూసుకెళుతోంది. గోల్డ్ షిమ్మ‌రీ డ్రెస్ లో మ‌లైకా వేడి ఫోజుల‌కు కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. మాల్దీవులలో తన సెలవుదినం తర్వాత ఈ హాట్ బ్యూటీకి సుందరమైన టాన్ మ‌రింత అద‌నంగా చేరింది. దానిని అంతే అందంగా ప్ర‌ద‌ర్శిస్తోంది మ‌లైకా.