Begin typing your search above and press return to search.

స్పెయిన్ నుంచి కేకలు పెట్టిస్తోంది

By:  Tupaki Desk   |   10 July 2017 5:37 AM GMT
స్పెయిన్ నుంచి కేకలు పెట్టిస్తోంది
X
మలైకా అరోరా అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు బోలెడంత మక్కువ ఎక్కువ. పవన్ కళ్యాణ్ మూవీ గబ్బర్ సింగ్ లో కెవ్వు కేకలు పెట్టించేసిన ఈ సుందరాంగిని.. తెలుగు ఆడియన్స్ బాగానే గుర్తు పెట్టేసుకున్నారు. ఇక హిందీ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఈమెతో ప్రత్యేకించి పరిచయాల అవసరమే ఉండదు.

ప్రస్తుతం ఈమె స్పెయిన్ లో షికార్లు కొడుతోంది. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే మలైకా.. 'స్పానిష్ స్కై కింద ఇలా ఉన్నా' అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. అయితే.. లో యాంగిల్ లోంచి తీసిన ఈ ఫోటోలో.. మలైకా అరోరా.. పైన నీలి ఆకాశం కనిపిస్తాయి. కానీ ఈ పిక్ చూసే వాళ్ల కళ్లు మాత్రం.. కింద ఉన్న కామెంట్ ను కానీ.. పైన కనిపించే ఆకాశం వైపు కానీ వెళ్లడం చాలా కష్టం. ఆకాశం కనిపించడం కోసం.. లో యాంగిల్ లోంచి తీసిన ఈ క్లోజప్ షాట్ లో.. మలైకా క్లీవేజ్ అందాలను ఆరబోసేసింది. అది కూడా ఉలెన్ వేర్ కావడంతో.. కప్పిన ప్రాంతంలోంచి కూడా అందాలు కనిపించేసి.. సందడి చేసేస్తున్నాయి.

స్పెయిన్ లో ప్రస్తుతం మలైకా లాంగ్ టూర్ లో ఉంది. అలాగని ఆమె ఒక్కతే అనుకోవాల్సిన పని లేదు. తన మాజీ భర్త అర్బాజ్ ఖాన్ ఫ్యామిలీతో కలిసి స్పెయిన్ లో షికార్లు కొట్టేస్తోంది మలైకా. తన పేరులోంచి ఖాన్ ను తీసేసినా.. ఖాన్ కుటుంబంలో సభ్యురాలిగానే కొనసాగుతోందిలే.