Begin typing your search above and press return to search.

ముత్యంలా మెరిసిపోయిన మ‌లైకం

By:  Tupaki Desk   |   25 Jan 2020 7:00 AM IST
ముత్యంలా మెరిసిపోయిన మ‌లైకం
X
త‌న‌దైన అందం ఫిట్ నెస్ తో నిరంత‌రం యూత్ క‌ళ్లు త‌న‌పైనే ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతుంది 46ఏళ్ల మ‌లైకా అరోరాఖాన్. ప‌ర్ఫెక్ట్ ఫిట్ నెస్ ఫ్రీక్ గా ఇప్ప‌టికే పాపుల‌రైంది. మ‌లైకా యోగా వీడియోలు అంత‌ర్జాలంలో పాపుల‌ర‌య్యాయి. ఇక ఫ్యాష‌న్ అండ్ ట్రెండ్స్ ని అనుస‌రించ‌డంలోనూ మ‌లైకా త‌ర్వాత‌నే. నిరంత‌రం ఈ అమ్మ‌డు పార్టీ గాళ్స్ లో హాట్ టాపిక్. ఇక మ‌లైకా ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్ స‌హా ర్యాంప్ వాక్ గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. గ‌త కొంత‌కాలంగా యువ‌హీరో అర్జున్ క‌పూర్ తో ప్రేమాయ‌ణం సాగిస్తూ హాట్ టాపిక్ గా మారింది.

వీట‌న్నిటినీ మించి ఈ భామ స్టైలింగ్.. ఫిట్నెస్ కి సంబంధించి ప్రతిదీ ఓ సంచలనమే. గ‌త కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్నా.. బుల్లితెర‌ రియాలిటీ షోలకు జడ్జిగా వ్య‌వ‌హ‌రిస్తూ బిజీబిజీగా ఉంటోంది. ప్ర‌స్తుతం ఇండియా నెక్స్ట్ టాప్ మోడల్ 5వ‌ సీజన్ కి జ‌డ్జిగా కొన‌సాగుతోంది. త్వరలో జరగబోయే డాన్స్ రియాలిటీ షో ఇండియా బెస్ట్ డాన్సర్ ని మ‌లైకా డిసైడ్ చేయ‌నుంది. తుది తీర్పు త్వ‌ర‌లోనే ఇవ్వనుంది.

తాజాగా ఇండియా బెస్ట్ డ్యాన్సింగ్ షో `ఓహ్ బాయ్` ప్రోమో షూట్ లోనూ పాల్గొంది మ‌లైకా. ఈ ప్రోమో షూట్ లో పెర్ల్ వైట్ గౌనులో పోజులిచ్చింది. ర‌క‌ర‌కాల భంగిమలతో మ‌లైక ఫోజులు కుర్ర‌కారును మ‌త్తెక్కించాయి. ముఖ్యంగా త‌ళ‌త‌ళా మెరిసే ముత్య‌పు రంగు డిజైన‌ర్ డ్రెస్ లో థై స్లిట్ లుక్ తో మైమ‌రిపించింది. ఒక పాత‌బ‌డిన అల్యూమినియం ఫ్యాక్ట‌రీ బ్యాక్ డ్రాప్ లో అందాల మ‌లైకా ఫోటోషూట్ ఎంతో స్పెష‌ల్ గా ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.