Begin typing your search above and press return to search.

ఆవిడ గెంటేసింద‌ని యంగ్ హీరో ఫీల‌య్యాడ‌ట‌!

By:  Tupaki Desk   |   28 April 2020 11:30 PM GMT
ఆవిడ గెంటేసింద‌ని యంగ్ హీరో ఫీల‌య్యాడ‌ట‌!
X
ఆమె ఆమె సోద‌రి మ‌ధ్య‌లో ఆయ‌నెవ‌రు? ఏమో కానీ.. ఆయ‌న‌పై ఆమెకు కోపం వ‌చ్చింది. ప‌క్క‌కు గెంటేసింది! ఇంత‌వ‌ర‌కూ నిజం. ఇక ఆయ‌న పేరు సిద్ధార్థ్ శుక్లా. ఆమె పేరు మ‌లైకా అరోరా. అత‌డు స‌ల్మాన్ హోస్టింగ్ చేసిన బిగ్ బాస్ సీజ‌న్ పార్టిసిపెంట్. అక్క‌డ బాగా పేరొచ్చాక సినిమాల‌తో బిజీ అయ్యాడు. ఇంత‌కీ మ‌లైకాతో అత‌డి గొడ‌వేంటి? అంటారా...

చాలా కాలం క్రితం ముంబైలో ఓ ఫంక్ష‌న్ కి వెళ్లిన‌ప్పుడు అక్క‌డ ఓ చిన్న ఇన్సిడెంట్ జ‌రిగింది. ఆ ఫంక్ష‌న్ కి మ‌లైకా త‌న సోద‌రి అమృత అరోరాతో క‌లిసి విచ్చేసింది. రావ‌డంతోనే ఫోటోగ్రాఫ‌ర్ల గుంపు మీద ప‌డ‌డంతో ఫోటోల‌కు ఫోజులిచ్చింది. అప్ప‌టికే అక్క‌డ‌కు వ‌చ్చిన సిద్ధార్థ్ శుక్లాని హ‌గ్ చేసుకుని వెల్ కం చెప్పింది. ఆ త‌ర్వాత త‌న సోద‌రి అమృత అరోరాతో క‌లిసి ఫోటోలు దిగుతోంది. ఈలోగానే సిద్ధార్థ్ ఆ ఇద్ద‌రి మ‌ధ్య‌కు వెళ్లాడు. దాంతో సీరియ‌స్ అయిన మ‌లైకా అత‌డిని ప‌క్క‌కు గెంటేసింది. ఆ దృశ్యానికి సంబంధించిన వీడియో వైర‌ల్ అవ్వ‌డంతో హీరోగారి ప‌రువు పోయింది. కొంత ఫ‌న్ కొంత సీరియ‌స్.. ఇలాంటివి భారీ వేడుక‌ల్లో త‌ప్ప‌దు కానీ మ‌రీ హీరో గారిని అలా తోసేయ‌డం కరెక్టేనా? అంటే సీనియ‌ర్ అయ్యాక‌ మ‌లైకా అంతేగా! అంటూ కామెంట్లు పెట్టారు నెటిజ‌నులు.

సిద్దార్థ్ తొలి చిత్రం `హంప్టీ శర్మకి దుల్హానియా` భారీ విజయాన్ని సాధించింది. అత‌డు ప్ర‌స్తుతం బాలీవుడ్ లో మంచి పేరు సంపాదించాడు. చివరిసారిగా షెహ్నాజ్‌తో కలిసి ఒక మ్యూజిక్ వీడియోలో సిద్ధార్థ్ కనిపించాడు. పోస్ట్ లాక్ డౌన్ అతని కోసం చాలా ప్రాజెక్టులను వెయిటింగులో ఉన్నాయిట‌. అయితే భ‌విష్య‌త్ స్టార్ అలా మలైకా వ‌ల్ల అవ‌మానానికి గుర‌య్యాడు ఆరోజు. అది అత‌డి అభిమానుల‌కు షాక్ నిచ్చిందన్న‌మాట‌.