Begin typing your search above and press return to search.

ముంబైలో ప్రముఖ సినీనటి బిల్డింగ్ సీజ్..

By:  Tupaki Desk   |   11 Jun 2020 6:50 AM GMT
ముంబైలో ప్రముఖ సినీనటి బిల్డింగ్ సీజ్..
X
ముంబై బ్యూటీ మలైకా అరోరా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆమె చేసిన ప్రత్యేక గీతాలతో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ముంబైలోనే నివాసముంటుంది. దేశవ్యాప్తంగా మహమ్మారి రోజురోజుకి లాక్ డౌన్ హద్దులు చెరిపేస్తూ లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ మహమ్మారిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఇప్పటికే మూడు లక్షలకు చేరువవుతున్న కరోనా కేసులు చూస్తుంటే దేశంలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏమి చేయాలో తోచక పాజిటివ్ వచ్చిన కేసులకు వైద్యం చేస్తున్నాయి. అయితే ముంబైలో నటి మలైకా అరోరా నివసిస్తున్న ఏరియాలో కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలిసింది.

ఆ వెంటనే ముంబై పోలీసులు ఆ ఏరియాను కంటైన్మెంట్ జోన్ గా పరిగణించారు. అయితే ఆ ఏరియాలో ఉంటున్న మలైకా అరోరా బిల్డింగ్ కూడా కంటైన్మెంట్ జోన్లో పరిగణించి సీజ్ చేశారట. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. రోజురోజు కొత్త కొత్త పోస్టులు పెడుతూ అభిమానులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. అయితే మలైకా బిల్డింగ్ కంటైన్మెంట్ జోన్లో నమోదు చేయడంతో ఇండస్ట్రీలో కాస్త కంగారు ఏర్పడినట్లు తెలుస్తుంది. కానీ మలైకా సేఫ్ గానే ఉందని.. ఎలాంటి ఆందోళన చెందొద్దని చెప్పినట్లు సమాచారం. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆన్ లైన్లో ఆరోగ్య చిట్కాలు.. యోగ ఆసనాలు నేర్పిస్తుంది మలైకా. రోజుకో కొత్త ఆసనంతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమాలు లేకపోయినా నెట్టింట మాత్రం మాములు క్రేజ్ పొందట్లేదు గుమ్మ. ఆసనాలతో ఫోటోషూట్లతో అమాంతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకుంటుంది. ప్రస్తుతం మలైకా హోమ్ క్వారంటైన్లో సేఫ్ గా ఉందని సమాచారం.