Begin typing your search above and press return to search.

47 వ‌ర్సెస్ 36 .. అయినా ప్రేమ ఎంత మ‌ధురం?

By:  Tupaki Desk   |   27 Jun 2021 8:30 AM GMT
47 వ‌ర్సెస్ 36 .. అయినా ప్రేమ ఎంత మ‌ధురం?
X
47 ఏళ్ల మలైకా అరోరా 36 ఏళ్ల అర్జ‌న్ క‌పూర్ మ‌ధ్య ప్రేమాయ‌ణం నిరంత‌రం హాట్ టాపిక్. 2021 జ‌న‌వ‌రిలో ఈ జంట మాల్దీవుల విహారం హాట్ టాపిక్ అయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌లైకా తన ప్రియుడు అర్జున్ కపూర్ కి తన 36 వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్రియుడితో క‌లిసి ఉన్న అరుదైన ఫోటోని మ‌లైకా షేర్ చేసింది. ఇది అన్ లిమిటెడ్ గా సాగే వారి వారాంత‌పు విహార యాత్ర‌ల నుంచి తీసిన త్రోబ్యాక్ ఫోటో అని అర్థ‌మ‌వుతోంది.

అర్జున్ కపూర్ పుట్టినరోజు పార్టీలో రణ్‌వీర్ సింగ్- విజయ్ దేవర‌కొండ సంద‌డి తెలిసిందే. జాన్వి కపూర్ - క‌రీనా- అన్షులా- కరణ్ జోహార్ - రణ‌బీర్ కపూర్- ఆలియా భ‌ట్‌.. త‌దిత‌రులు క‌నిపించారు.

మ‌లైకా షేర్ చేసిన ఫోటోలో అర్జున్ కపూర్ బూడిద రంగు స్వెట్ ష‌ర్ట్ ధ‌రించి టోపీతో క‌నిపించారు. మలైకా అరోరా బూడిద రంగు లెగ్గింగ్స్ తో పాటు బ్లూ ట్యాంక్ టాప్ పై తెల్లటి జాకెట్ ధరించి క‌నిపిస్తోంది. అరుదైన హ్యాపీ మూడ్ లో ప్రియుడిని కౌగిలించుకుని ఆస్వాధ‌న‌లో మునిగిపోయింది మ‌లైకా.

మలైకా అరోరా - అర్జున్ కపూర్ 2019 లో తమ సంబంధంపై ఓపెన‌య్యారు. అప్పటి నుండి వినోద‌ విహారయాత్రలలో అనేకసార్లు కనిపించారు. ప్ర‌తిసారీ ఒకరితో ఒకరు క‌లిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అర్జున్ కపూర్ చివరిసారిగా సందీప్ P ర్ పింకీ ఫరార్ -సర్దార్ కా గ్రాండ్ సన్ చిత్రాలలో కనిపించారు. ఈ రెండు సినిమాల్లో అత‌డి న‌ట‌న ఆక‌ట్టుకుంది.