Begin typing your search above and press return to search.

లాక్‌ డౌన్‌ లో హాటీ బ్యూటీ టిప్స్‌ చెబుతోంది

By:  Tupaki Desk   |   30 March 2020 4:17 PM GMT
లాక్‌ డౌన్‌ లో హాటీ బ్యూటీ టిప్స్‌ చెబుతోంది
X
బాలీవుడ్‌ హాట్‌ ఐటెం బాంబ్‌ మలైకా అరోగా అయిదు పదుల వయసుకు దగ్గరకు చేరినా కూడా ఇంకా మూడు పదుల వయసులో ఉన్నట్లుగానే కనిపిస్తూ ఉంటుంది. చాలా రెగ్యులర్‌ గా గంటల తరబడి జిమ్‌ లో వర్కౌట్స్‌ చేసే మలైకా అరోరా పలు సార్లు జిమ్‌ ముందు తన హాట్‌ ఫిజిక్‌ తో తన స్టిఫ్‌ బాడీతో ఫొటోకు ఫోజులు ఇవ్వడం ఆ ఫొటోలు వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ అమలులో ఉన్న కారణంగా జిమ్‌ లు అన్ని కూడా మూత పడ్డాయి.

సెలబ్రెటీలు కొందరు జిమ్‌ లో వర్కౌట్స్‌ లేక పోవడం తో బరువు పెరుగుతామేమో అని భయపడుతున్నారు. మరికొందరు బ్యూటీ పార్లర్‌ కు వెళ్లక పోవడం వల్ల తమ స్కిన్‌ చెడిపోతుందేమో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో బ్యూటీ పార్లర్‌ కు వెళ్లకుండానే చర్మంను కాంతి వంతంగా ఉంచుకోవడం తో పాటు పలు అనారోగ్య సమస్యలకు ఎలా దూరంగా ఉండాలనే విషయాన్ని మలైకా అరోరా సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తోంది.

అలోవేరా తో చర్మంను పరిరక్షించుకోవాలని ఆమె సూచిస్తోంది. ప్రస్తుతం తాను తీసుకుంటున్న స్కిన్‌ కేర్‌ గురించి ఆమె వెళ్లడి చేసింది. అలోవేరా జెల్‌ చాలా గొప్ప స్కిన్‌ కేర్‌ ప్రొడక్ట్‌. ఇది ప్రతి ఒక్కరికి కూడా బాగా పని చేస్తుంది. చర్మంపై ఉండే ర్యాషెష్‌ ఇంకా కోతలు చర్మం కమిలి పోవడం వంటివి ఉంటే అలోవేరా జెల్‌ బాగా పని చేస్తుందని మలైకా చెబుతోంది. చర్మంకు అలోవేరా జెల్‌ బాగా పని చేస్తుందని ఆమె చెప్పుకొచ్చింది. అలోవేరా జ్యూస్‌ తో కూడా పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటూ మలైకా పేర్కొంది. ఈ లాక్‌ డౌన్‌ సమయంలో బయటకు వెళ్లకుండా మీ చర్మంను ఇంట్లోనే ఉండి కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ మలైకా చెప్పుకొచ్చింది.