Begin typing your search above and press return to search.

#త్రోబ్యాక్.. పెగ్గు మీద పెగ్గేసి పార్టీలోనే గొడ‌వ‌కు దిగిన తార‌

By:  Tupaki Desk   |   26 Dec 2020 11:30 AM IST
#త్రోబ్యాక్.. పెగ్గు మీద పెగ్గేసి పార్టీలోనే గొడ‌వ‌కు దిగిన తార‌
X
బాలీవుడ్ ఫేజ్ 3 క‌ల్చ‌ర్ లో మందు చిందు అనేవి స‌ర్వ‌సాధార‌ణం. అయితే అలాంటి ఓ పార్టీలో ఇద్ద‌రు భామ‌ల మ‌ధ్య గొడ‌వ ప‌తాక స్థాయికి చేరుకోవ‌డం మ‌ధ్య‌లో వేరొక‌రు త‌ల‌దూర్చి ప‌రిష్క‌రించ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మే అయ్యింది.

అప్ప‌ట్లో ముంబైలోని ఓ ఖ‌రీదైన రెస్టారెంట్ లో మ‌నీష్ మ‌ల్హోత్రా 50వ బ‌ర్త్ డే వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి.. ఆ పార్టీలో పెగ్గు మీద పెగ్గు లాగించేసిన మ‌లైకా అదుపు త‌ప్పి తూలి ప‌డ‌బోయింద‌ట‌. దాంతో త‌న‌కు సాయం చేసేందుకు ప‌క్క‌నే ఉన్న సోన‌మ్ క‌పూర్ ప‌డ‌కుండా ఆపే ప్ర‌య‌త్నం చేసింద‌ట‌. సాయం కావాలంటే నేనున్నాను! అంటూ సోన‌మ్ త‌న‌ని వారించ‌‌బోతే ``బ్యాక్ ఆఫ్`` (వెన‌క్కి వెళ్లు) అంటూ సోన‌మ్ పై మ‌లైకా గ‌ట్టిగానే అరిచేసింది‌. నాకు నేను వెళ్ల‌గ‌ల‌ను.. ఎవ‌రి సాయం అవ‌స‌రం లేదు! అంటూ రుస‌రుస‌లాడేయ‌డంతో చుట్టూ ఉన్న‌వాళ్లంతా అవాక్క‌య్యారు.

చివ‌రికి ఆ ఇద్ద‌రి గొడ‌వ మ‌నీష్ - క‌ర‌ణ్ జోహార్ క‌ల‌గ‌జేసుకోవ‌డంతో స‌ద్ధుమ‌ణిగింది. ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు అప్ప‌ట్లో సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అయ్యాయి. ఇక అప్ప‌టికే మ‌లైకా త‌న భ‌ర్త ఆర్భాజ్ ఖాన్ కి విడాకులు ఇచ్చి క‌ల‌త‌లో ఉన్నారు. ఆ త‌ర్వాత ఇలా మందు పార్టీలో ర‌భ‌స సాగింద‌నేది బాలీవుడ్ మీడియా క‌థ‌నాలు వెల్ల‌డించాయి.

అప్పుడ‌ప్పుడే యువ‌హీరో అర్జున్ క‌పూర్ తో మలైకా ఎఫైర్ వార్త‌లు అంత‌కంత‌కు వేడెక్కుతున్నాయి. ఆ ఇద్ద‌రి ఎఫైర్ విష‌యంలో స‌మ‌ర్ధించిన సోన‌మ్ క‌పూర్ కి ఆ రాత్రి ఊహించ‌నిదే ఎదురైంది.