Begin typing your search above and press return to search.

పెళ్లి పార్టీలో మ‌లైకా-అర్జున్ మెరుపులు

By:  Tupaki Desk   |   5 Feb 2020 3:04 PM GMT
పెళ్లి పార్టీలో మ‌లైకా-అర్జున్ మెరుపులు
X
బాలీవుడ్ ప్రేమ‌ప‌క్షులు మలైకా అరోరా- అర్జున్‌ కపూర్ ప్రేమ వ్య‌వ‌హారం గురించి తెలిసిందే. అర్జున్ క‌పూర్ త‌న‌క‌న్నా వ‌య‌సులో 12 ఏళ్ల పెద్ద అయిన మ‌లైకాతో డీప్ ల‌వ్‌ లో ఉన్నాడు. ఆ ఇద్ద‌రూ చెట్టాప‌ట్టాలేకుని షికార్లు చేయ‌డం... విదేశీ ప‌ర్య‌ట‌న‌లు మీడియాలో హాట్ టాపిక్. పార్టీలు...ప‌బ్ లు అంటూ షికార్ల గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఇది ల‌వ్ అంటూ ఆ ఇద్దరూ ఏ రోజు ఓపెన్ కాలేదు. పెళ్లి గురించిన ఆలోచ‌న ఇప్ప‌ట్లో లేద‌ని తాము హ్యాపీగా ఉన్నామ‌ని ఈ జంట ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. వాళ్లిద్ద‌రు ఒక‌రిని విడిచి ఒక‌రు ఉండ‌లేరు అన‌డానికి తాజా ఫోటో సాక్ష్య‌మిది.

తాజాగా ఈ జంట ఓ పెళ్లిలో త‌ళుక్కున మెరిసారు. న‌టుడు ఆర్మాన్ జైన్ - అనిస్సా మ‌ల్హోత్రా జంట వివాహంలో మెరుపులు మెరిపించారు. ఇటీవ‌లే గ్రాండ్ గా బాలీవుడ్ సెల‌బ్రిటీలందిర‌కీ రిసెప్ష‌న్ ఇచ్చారు న‌వదంప‌తులు. దాదాపు బాలీవుడ్ సెల‌బ్రిటీలంతా విందుకు హాజ‌ర‌య్యారు. తార‌ల త‌ళుకుబెళుకుల న‌డుమ రిసెప్ష‌న్ అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. ఇందులో క‌పుల్స్ ఎంద‌రో హ‌ల్ చ‌ల్ చేశారు. ప్రేమికులు హాజ‌రయ్యారు. పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న జంట‌లు సంద‌డి చేశాయి. వీరంతా ప్ర‌త్యేక ఫోటో సెష‌న్ లో పాల్గొన్నారు.

ఈ క్ర‌మంలోనే అర్జున్ క‌పూర్ .. మ‌లైకాతో జ‌త‌గా అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మయ్యాడు. ఆ ఇద్ద‌రు ఒకే కారులో దిగి చేతిలో చెయ్యి వేసుకుని న‌డిచి వ‌చ్చిన తీరు అక్క‌డ హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి చేసుకోకుండానే మేం భార్య భ‌ర్త‌లం అన్నంత సీన్ క్రియేట్ చేసింది ఈ జంట‌. మ‌లైకా ఆరెంజ్ క‌ల‌ర్ డిజైనర్ వేర్ లో..అర్జున్ క‌పూర్ గ్రీన్ క‌ల‌ర్ దుస్తుల్లో ధ‌గధ‌గా మెరిసిపోయారు. ముందుగా ఆ ఇద్ద‌రు జంట‌గా ఫోటోల‌కు ఫోజులిచ్చారు. అనంత‌రం వేరు వేరుగా ఫోటో సెష‌న్ లో పాల్గొన్నారు. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. దీంతో నెటిజ‌నులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు.