Begin typing your search above and press return to search.

అందరికీ కరోనా.. వారికి మాత్రం ప్యార్ కరోనా!

By:  Tupaki Desk   |   24 March 2020 11:00 PM IST
అందరికీ కరోనా.. వారికి మాత్రం ప్యార్ కరోనా!
X
కొన్ని పదాలు మనల్ని వెంటాడతాయి. వేధిస్తాయి.  ఇప్పుడు ప్రపంచం అంతటినీ వేధిస్తున్న పదమే కరోనా.  కోవిడ్-19 అని కూడా అంటున్నారు. కొందరేమో నావెల్ కరోనావైరస్ అని కూడా అంటున్నారు. ఈ దెబ్బకు ప్రపంచం అతలాకుతలం అయింది. చాలామంది ఈ సమయంలో చైనాను తిట్టుకుంటున్నారు కానీ వారు కరోనాను కంట్రోల్ చేస్తున్న విధానం అన్నీ దేశాలకు ఆదర్శం.  ఈ మాయదారి కరోనా దెబ్బకు భారత దేశ ప్రజలకు పెద్ద షాక్ తగలింది.  కొందరు అతీశ్వరులకు తప్ప మిగతావారికి స్వేచ్ఛ లేకుండా పోయింది.

ఇండియాలో అందరికీ ఉండేదే స్వేచ్ఛ..  ఎక్కడైనా తిరగొచ్చు.  ఎవరినైనా తిట్టొచ్చు. నోటికొచ్చిన లాజిక్కులు చెప్పి అందరినీ నోర్లు మూయించవచ్చు. ఇప్పుడు అలాంటివి ఏమీ కుదరవు. అందుకే పెద్ద పెద్ద సెలెబ్రిటిలు కూడా ఇంట్లో కూర్చుని గోళ్ళు గిల్లుకుంటున్నారు.  అయితే అందరూ అలా ఉండరు.  కొందరు తమపై పడే రాళ్ళతో దుర్గం నిర్మించుకుంటారట. అలా ఈ కరోనా క్వారంటైన్ లో అర్జున్ కపూర్- మలైకా అరోరా జంట  కరోనా హాలిడేస్ ను విచ్చలవిడిగా వాడుకుంటూ విపరీతంగా ప్రేమించుకుంటున్నారట. అందరికీ కరోనా అని వినిపిస్తే  వీరికి మాత్రం (ప్యార్) కరోనా అని అనిపిస్తున్నట్టుగా ఉందని బాలీవుడ్ మీడియా చెవులు కొరుక్కుంటోంది.

జనతా కర్ఫ్యూ సందర్భంగా ఈ జంట ఉత్సాహంగా బయటకు వచ్చి బాల్కనీలో చప్పట్లు కొట్టారు. అత్యవసర సేవలు అందిస్తున్నవారికి తమ జేజేలు తెలిపారు. అది పక్కన పెడితే ఈ ప్రేమ పక్షులు ఒకే ఇంట్లో ప్రేమఖైదీలుగా ఉన్నారనే సంగతి బయటకు వచ్చేసింది.  ఈ వ్యవహారం గమనిస్తున్న కొందరు నెటిజన్లు వీరి ఘాటు వరస చూస్తుంటే కరోనా వ్యవహారం సద్దుమణిగే లొపు బోనీ కపూర్ ను తాతయ్యను చేసేలా ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడేవారు ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే కరోనా కారణంగా ఆందోళనతో చేసుకునే ఆత్మహత్యలు ఉండవు. ప్రపంచం అంతా ప్రేమమయం అవుతుంది!