Begin typing your search above and press return to search.

వీడియో టాక్: అబ్బురపరిచే 2.0

By:  Tupaki Desk   |   7 Oct 2017 10:20 PM IST
వీడియో టాక్: అబ్బురపరిచే 2.0
X
ఇప్పుడు ఇండియా బాహుబలి కోసం ఎదురు చూస్తున్నట్లు వెయిటింగ్ చేస్తున్న సినిమా ఏదన్నా ఉందీ అంటే అది ఖచ్చితంగా ''2.0'' అని చెప్పొచ్చు. శంకర్ డైరక్షన్లో సూపర్ స్టార్ రజీనీకాంత్ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్న '2 పాయింట్ ఓ' సినిమాలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా జనవరి 2018లో రిలీజవ్వనుండగా.. ఇప్పుడు ఒక మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.

అసలు స్టీరియోస్కోపిక్ 3డి లో '2 పాయింట్ ఓ' సినిమాను ఎందుకు రూపొందిస్తున్నారో చెబుతూ.. శంకర్ ఈ వీడియోను రూపొందించాడు. మధ్య మధ్యలో కనిపిస్తున్న రజనీకాంత్ రోబో లుక్స్.. అలాగే మరో సైంటిస్ట్ లుక్ తో పాటు.. విలన్ గా అక్షయ్.. హీరోయిన్ యామీ.. భలేగున్నారులే. పైగా ప్రీ-విజువలైజేషన్ షాట్స్ లో అసలు ఏ సీన్ ఎలా ఉండబోతుందో ముందే క్రియేట్ చేసే చూపించడం భలేగా ఉంది. సినిమాటోగ్రాఫర్ నిరవ్ షా కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ సినిమాను చిత్రీకరించినట్లు అర్ధమవుతోంది.

ఇప్పటికే ఈ మేకింగ్ వీడియోను చూసి అభిమానులు తలైవా తలైవా అంటూ కలవరిస్తున్నారు. ఈ వీడియోలో రజనీకాంత్ కూడా ఇంగ్లీషులో వాయిస్ ఓవర్ ఇచ్చారు కాని.. ఎదురుగా కనిపించ ఏమీ మాట్లాడలేదు. అయితే సినిమా రిలీజ్ కు ముందే ఇలాంటి మేకింగ్ వీడియోలు రిలీజ్ చేసి చాలా హైప్ పెంచేస్తున్నారు '2 పాయింట్ ఓ' టీమ్.