Begin typing your search above and press return to search.

అక్కినేని కోడ‌లుకి అలా షాకిచ్చిన ప‌ర్స‌న‌ల్ మేక‌ప్ టీమ్

By:  Tupaki Desk   |   29 April 2021 7:31 AM GMT
అక్కినేని కోడ‌లుకి అలా షాకిచ్చిన ప‌ర్స‌న‌ల్ మేక‌ప్ టీమ్
X
అక్కినేని కోడ‌లు సమంత ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు హ‌బ్బీ నాగ‌చైత‌న్య వ‌రుస సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా బిజీగా ఉంటే.. స‌మంత‌ కూడా అంతకుమించి బిజీగా ఉన్నారు. ఓవైపు వెబ్ సిరీస్ లు వెబ్ షోలు.. వాటితో పాటే సినిమాలతో క్ష‌ణం తీరిక అన్న‌దే లేదు.

బుధవారం (29ఏప్రిల్) నాటికి సమంతా అక్కినేనికి 34 ఏళ్ళు నిండాయి. ఈ సంద‌ర్భంగా మేక‌ప్ ఆర్టిస్టులు స్టైలిష్ట్ బృందం త‌న‌కు ఊహించ‌ని స‌ర్ ప్రైజ్ ట్రీట్ ని ఇచ్చారు. సామ్ వెంట నిరంత‌రం ఉండే ప్రధాన టీమ్ స‌భ్యులు వానిటీ వ్యాన్ లో స‌ర్ ప్రైజింగ్ గా పుట్టినరోజు పార్టీని ప్లాన్ చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోను పంచుకున్న సమంతా తన టీమ్ స‌భ్యులు ఇచ్చిన ట్రీట్ కి చాలా స‌ర్ ప్రైజ్ అయ్యార‌ట‌. అద్భుత‌మైన బ‌ర్త్ డే పార్టీతో షాకిచ్చిన టీమ్ కు ధన్యవాదాలు తెలిపారు.

నేడు సామ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఇండ‌స్ట్రీ స‌హ‌చ‌రులు త‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. రాశి ఖన్నా- హన్సిక మోత్వానీ-వెంకటేష్- మనోజ్ బాజ్ పేయి- కీర్తి సురేష్- తమన్నా వంటి పలువురు ప్రముఖులు సోష‌ల్ మీడియాల్లో సమంతా అక్కినేని కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

సామ్ స్టైలిస్ట్ లు హెయిర్ అండ్ మేకప్ ఆర్టిస్టుల బృందం వానిటీ వ్యాన్ లో కేక్ క‌టింగ్ కార్య‌క్ర‌మం అనంత‌రం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఫోటోలో సాధనా సింగ్- కొడురు అమర్ నాథ్- ఆర్యన్ దగ్గుబాటి- వసంత గొల్లముడి- మూర్తి ఉంగరాలా,- షేక్ నసీర్ క్వాద్రి త‌దిత‌రులు ఉన్నారు. ``మీరంతా అబ్బాయిలు కావడం నాకు చాలా ఆశీర్వాదం! నా పుట్టినరోజు వేడుక ఎంతో మధురమైన జ్ఞాప‌కం.. స‌ర్ ప్రైజ్ పార్టీకి ధన్యవాదాలు`` అన్నారు. ఈ పార్టీకి హోస్టింగ్ చేసిన‌ తన మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ కు సామ్ కృతజ్ఞతలు తెలిపింది.

సమంత చివరిసారిగా జాను చిత్రంలో కనిపించారు. గుణశేఖర్ దర్శకత్వం లో శాకుంతలం లో కనిపించనుంది. విజయ్ సేతుపతి -నయనతారతో కలిసి విఘ్నేష్ శివన్ `కాతువాకుల రేండు కాదల్`లో న‌టిస్తోంది. సమంతా ఈ సంవత్సరం ది ఫ్యామిలీ మ్యాన్ 2 తో డిజిటల్ అరంగేట్రం చేయనున్నారు. ఇది జూన్ లేదా జూలైలో విడుదల కానుందని స‌మాచారం.