Begin typing your search above and press return to search.
ఫీమేల్ మేకప్ ఆర్టిస్ట్ పై దాడులు వేధింపులు?
By: Tupaki Desk | 18 March 2021 6:00 PM ISTప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ వేధింపుల వ్యవహారం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. అది కూడా బాలీవుడ్ యువకథానాయిక సారా అలీ ఖాన్ మేకప్ ఆర్టిస్ట్ ఫ్లోరియన్ హురెల్.. శ్రద్ధా కపూర్ మేకప్ ఆర్టిస్ట్ అయిన హియావి సైగల్ పై శారీరకంగా బౌతిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో బాలీవుడ్ లో దానిపై వరుస కథనాలు వైరల్ అవుతున్నాయి.
ఫ్లోరియన్ హురెల్ బాలీవుడ్ సర్కిల్స్ లో బాగా తెలిసిన పేరు. అతను గతంలో సారా అలీ ఖాన్- శిల్పా శెట్టి కుంద్రా- సోనాక్షి సిన్హా -రకుల్ ప్రీత్ సింగ్ వంటి ప్రముఖ తారలతో కలిసి పనిచేశాడు. తన మాజీ గాళ్ ఫ్రెండ్ అయిన మేకప్ ఆర్టిస్ట్ హియావి సైగల్ పై అతడు శారీరక దాడి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
దాడికి గురైన ఫీమేల్ మేకప్ ఆర్టిస్ట్ ఇటీవల తన అభిమానులు.. అనుచరులతో Q & A సెషన్ లో పాల్గొనగా ఒక అభిమాని.. ఫ్లోరియన్ హురెల్ తో శారీరక సంబంధంపై ప్రశ్నించారు. దానికి స్పందిస్తూ.. ``ఇది బాస్ అసిస్టెంట్ సంబంధంగా ప్రారంభమైంది. చాలా వేగంగా స్నేహంగా మారింది. మేమిద్దరం ఇతర వ్యక్తులతో డేటింగ్ చేస్తున్నాం. కానీ కొద్ది కాలానికే మేం ప్రేమలో ఉన్నామని గ్రహించాము. ఇవన్నీ డేటింగ్ కథలు. చాలా త్వరగా వివాదాస్పదమయ్యాయి. నిశ్చితార్థం ముందు గొడవలివి`` అంటూ ఫ్లోరియన్ హురెల్ తో తన మ్యాటర్స్ గురించి ఆమె కొన్ని ప్రైవేట్ చాట్లను అభిమానులతో పంచుకుంది.