Begin typing your search above and press return to search.

నితిన్ 'చెక్' రిలీజ్ డేట్ లాక్ చేసిన మేకర్స్..!

By:  Tupaki Desk   |   22 Jan 2021 12:19 PM GMT
నితిన్ చెక్ రిలీజ్ డేట్ లాక్ చేసిన మేకర్స్..!
X
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ - క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'చెక్'. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఉరిశిక్ష ప‌డిన ఖైదీ జీవిత నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ - ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేస్తారని ఈ మధ్య రూమర్స్ వినిపించాయి. తాజాగా మేకర్స్ 'చెక్' సినిమాని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి వీటికి చెక్ పెట్టారు. ఫిబ్రవరి 19న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు.

జైలు నేపథ్యంలో ఉరిశిక్ష పడిన ఓ ఖైదీ చెస్ గేమ్ ద్వారా అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనేది ఈ చిత్ర ప్రధాన కథాంశం. ఆధ్యంతం ఆసక్తికరంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'చెక్' చిత్రాన్ని వచ్చే నెల 19న విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు త్వరలోనే మొదలు పెట్టనున్నారు. ఇకపోతే నితిన్ నటించిన 'రంగ్ దే' చిత్రాన్ని మార్చి 26న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఇటీవల అధికారికంగా ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. 'భీష్మ' వంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత నితిన్ ఇలా రెండు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు.