Begin typing your search above and press return to search.

మెగా రీమేక్ లో రౌడీ ఉన్నాడా? లేడా?

By:  Tupaki Desk   |   9 July 2020 9:10 AM GMT
మెగా రీమేక్ లో రౌడీ ఉన్నాడా? లేడా?
X
మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ తెలుగులో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఈ రీమేక్ రూపొందబోతుంది. సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపుగా పూర్తి అయింది అని.. సాయి మాధవ్ బుర్ర ప్రస్తుతం డైలాగ్ వర్షన్ రెడీ చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం ఒకటి చర్చ జరుగుతోంది.

లూసీఫర్ సినిమాలో పృథ్వీ రాజ్ పోషించిన కీలక పాత్ర కోసం పలు యంగ్ స్టార్స్ ను పరిశీలిస్తున్నారు. ఈ సమయంలో విజయ్ దేవరకొండ పేరు కూడా వినిపిస్తుంది. మెగా స్టార్ మూవీలో విజయ్ దేవరకొండ ఉంటే సినిమా స్థాయి మరింత పెరగడం ఖాయం.

లూసీఫర్ తెలుగు రీమేక్ కోసం చాలా మార్పులు చేర్పులు చేశారు. అందుకే సినిమా లో ఆ పాత్రను విజయ్ దేవరకొండ చేస్తే బాగుంటుంది అంటూ మేకర్స్ భావిస్తున్నారట. మరి రౌడీ స్టార్ ఈ రీమేక్ కు ఒకే చెప్పాడా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఆ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.