Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్‌ కు దెబ్బ మీద దెబ్బ

By:  Tupaki Desk   |   11 Dec 2020 10:34 AM IST
కీర్తి సురేష్‌ కు దెబ్బ మీద దెబ్బ
X
కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్‌ అయిన పెద్ద సినిమాల్లో మొదటి సినిమాగా పెంగ్విన్‌ నిలిచింది అనవచ్చు. కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో నటించిన పెంగ్విన్‌ సినిమాను అమెజాన్‌ లో స్ట్రీమింగ్‌ చేయడం జరిగింది. కీర్తి సురేష్‌ పై నమ్మకంతో తెలుగు మరియు తమిళ ఆడియన్స్‌ రచ్చ రచ్చగా ఈ సినిమాను చూస్తారంటూ అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా పెంగ్విన్ సినిమాకు అట్టర్‌ ప్లాప్‌ టాక్‌ రావడంతో ఎవరు కూడా అమెజాన్‌ లో ఆ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు శాటిలైట్‌ లో కూడా పెంగ్విన్‌ సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది.

ఓటీటీ లో నిరాశ పర్చినా కూడా ఇలాంటి సినిమాలు శాటిలైట్‌ లో ఆకట్టుకున్న సందర్బాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమాను జీ తెలుగు వారు కాస్త ఎక్కువ రేటుకే కొనుగోలు చేశారు. గత నెలలో ఈ సినిమాను వరల్డ్‌ ప్రీమియర్‌ చేశారు. కాని సినిమాకు ఆశించిన స్థాయిలో రేటింగ్‌ రాలేదు. కనీసం 8 నుండి 10 రేటింగ్‌ ను జీ తెలుగు వారు ఆశించారు. కాని వారిని తీవ్రంగా నిరాశ పర్చింది. కేవలం 3.64 రేటింగ్ ను మాత్రమే నమోదు చేసింది. పోటీగా పెద్ద సినిమాలు లేకపోయినా.. కొత్త సినిమాలు రాకపోయినా కూడా పెంగ్విన్‌ మాత్రం మెప్పించలేదు. కీర్తి సురేష్‌ పెంగ్విన్‌ కు ఓటీటీ తో పాటు శాటిలైట్‌ లో కూడా దెబ్బ పడ్డట్లయ్యింది.