Begin typing your search above and press return to search.

'రిపబ్లిక్' ఫస్ట్ సింగిల్ అప్డేట్.. దేవ కట్టా-మణిశర్మ డిస్కషన్స్..!

By:  Tupaki Desk   |   5 July 2021 1:30 PM GMT
రిపబ్లిక్ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. దేవ కట్టా-మణిశర్మ డిస్కషన్స్..!
X
సుప్రీమ్ హీరో సాయి తేజ్‌ - 'ప్రస్థానం' ఫేమ్ దేవ కట్టా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ ''రిపబ్లిక్''. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌ పై జె.భగవాన్ - జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదల చేయబడిన ఈ సినిమా ఫస్ట్ లుక్ - మోషన్ పోస్టర్ - టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. సందేశాత్మక అంశాలతో కూడిన సినిమాని చూడబోతున్నామని హింట్ ఇచ్చాయి. ఈ క్రమంలో మరో అప్డేట్ తో మేకర్స్ ముందుకొచ్చారు. సినిమాలోని ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ.. 'గానా ఆఫ్ రిపబ్లిక్' పేరుతో దీనికి సంబంధించిన అనౌన్సమెంట్ వీడియోని వదిలారు.

'రిపబ్లిక్' డైరెక్టర్ దేవా కట్టా - మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ - లిరిసిస్ట్ రెహమాన్ మధ్య ఫస్ట్ సింగిల్ గురించి జరిగిన డిస్కషన్ ని ఈ వీడియోలో చూపించారు. స్వేచ్ఛ ని అమ్మాయిలా ఊహించుకొని కాలేజీలో కుర్రాళ్ళు పాడుకునేలా థీమ్ సాంగ్ ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రెహమాన్ సాహిత్యం రాసుకొని వచ్చిన తర్వాత మణిశర్మ ఈ పాత్రకు ట్యూన్ కంపోజ్ చేయడం గమనార్హం. 'హేయ్ రారో.. హేయ్ రారో..' అంటూ సాగే ఈ యూత్ ఫుల్ సాంగ్ ని జూలై 11న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. 'గానా ఆఫ్ రిపబ్లిక్' ను యువ గాయకులు అనురాగ్ కులకర్ణి - ధనుంజయ్ - హైమత్ మహ్మద్ - ఆదిత్య అయ్యంగర్ - పృథ్వీ చంద్ర కలసి ఆలపించారు. రాజు సుందరం మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు.

కాగా, 'రిపబ్లిక్' చిత్రంలో ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో సాయి తేజ్ కనిపించనున్నాడు. విలక్షణ నటి రమ్యకృష్ణ నెగెటివ్ షేడ్స్ ఉన్న రాజకీయ నాయకురాలు పాత్ర పోషించారు. ఇందులో సాయి తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు కీలక పాత్ర చేస్తున్నారు. ఎమ్.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి.. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నాడు. జులై 4న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడింది. త్వరలోనే తదుపరి రిలీజ్ డేట్ ని ఖరారు చేయనున్నారు.