Begin typing your search above and press return to search.
మాలీవుడ్ లో వేధింపుల కలకలం: మేకప్ ఆర్టిస్ట్ కు నగ్న ఫొటోలు, మెసేజ్ లు
By: Tupaki Desk | 13 Jun 2020 11:30 AM ISTఓ ఆర్టిస్ట్ కు లైంగిక వేధింపుల అంశం మలయాళ సినిమా పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించాయి. టాప్ మేకప్ ఆర్టిస్టు, ట్రాన్స్‌జెండర్ సీమ వినీత్‌కు ప్రముఖ నటి కుమారుడి నుంచి చేదు అనుభవం ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి. తనను వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అసభ్య సందేశాలు, అశ్లీల ఫోటోలు పంపుతూ తనను వేధించాడని ఆమె ఆరోపిస్తోంది.
మలయాళ నటి మాల పార్వతీ కుమారుడు అనంతకృష్ణన్ తనను 2017 నుంచి వేధిస్తున్నాడని సీమ వినీత్ తెలిపింది.. అసభ్యకరమైన మెసేజ్‌లు, న్యూడ్ పిక్చర్స్ పంపుతూ తనను విసిగించాడని వాపోయింది. అలా చేయొద్దని చగప్పినా అలాగే చేస్తుండడంతో విధిలేక బయటపెట్టాల్సి వచ్చినట్లు ఆమె ఫేస్‌బుక్ లైవ్‌లో వెల్లడించింది.
ఈ విషయాన్ని అతడి తల్లి, నటి మాల పార్వతి దృష్టికి తీసుకెళ్లగా ఆమె చాలా బాధ పడ్డారని తెలిపారు. ఆ తర్వాత ఆమె తనకు ఫోన్ లో క్షమాపణలు చెప్పారని వివరించారు. తన కుమారుడిని హద్దు మీరకుండా చూసుకొంటానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఫేస్‌బుక్ లైవ్‌లోనే తన కుమారుడు అనంత కృష్ణన్ చేసిన పనికి మహిళగా మాల పార్వతి చాలా బాధ పడ్డారు. ఈ వ్యవహారం పై తాను పోలీసులకు, సైబర్ క్రైమ్ వారికి ఫిర్యాదు చేస్తానని సీమా చెప్పారు.
నటి మాల పార్వతి స్పందించి వేధింపుల విషయం ఆరా తీశారు. కుమారుడికి ఫోన్ చేసి మాల పార్వతి అసలు విషయం రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే తమ ఇద్దరి మధ్య అవగాహనతోనే ఇదంతా జరిగిందని తన కుమారుడు చెప్పినట్లు మాల తెలిపారు. కానీ ఈ విషయంలో వాస్తవాలు బయట పెట్టాలని పోలీసులకు స్వయంగా తల్లి మాల పార్వతి ఫిర్యాదు చేశారు.
తన కుమారుడి విషయంలో తప్పుందా? ఒప్పుందా అనే విషయం కాకుండా ఈ సమయంలో తాను సీమా వినీత్‌కు అండగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు నటి మాలపార్వతీ తెలిపారు. తన కుమారుడికి సపోర్ట్ చేయనని.. లీగల్ గా ఈ వ్యవహారం లో వాస్తవాలు బయటపడేంత వరకు నేను నిజాయితీగా వ్యవహరిస్తానని వెల్లడించారు.