Begin typing your search above and press return to search.

రిలీజ్ మంత్‌ హంగామా మొదలు పెట్టనున్న 'మేజర్‌'

By:  Tupaki Desk   |   4 May 2022 2:30 AM GMT
రిలీజ్ మంత్‌ హంగామా మొదలు పెట్టనున్న మేజర్‌
X
రియల్‌ ఇండియన్ ఆర్మీ హీరో సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితంలోని ముఖ్య సంఘటనల ఆదారంగా కల్పిత సన్నివేశాలు మరియు పాత్రలతో కమర్షియల్‌ మూవీగా 'మేజర్‌' ను తెరకెక్కించడం జరిగింది. అడవి శేషు హీరోగా నటించిన ఈ సినిమాకు శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహించాడు. సోని పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్ వారు మన మహేష్ బాబు సొంత నిర్మాణ నిర్మాణ సంస్థ అయిన జీఎంబి ఎంటర్‌ టైన్‌మెంట్స్ తో కలిసి నిర్మించారు.

మేజర్ సినిమా కరోనా వల్ల వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 27వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమా ను కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్న నేపథ్యంలో కాస్త ముందుగానే ప్రమోషన్ హడావుడి షురూ చేస్తున్నారు.

ఇప్పటికే సినిమా ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ విడుదల చేయడంతో పాటు గ్లిమ్స్.. టీజర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. త్వరలోనే ట్రైలర్‌ విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ముంబయి నుండి మొదలు పెట్టే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది.

సినిమా లో హీరోగా నటించిన అడవి శేషు సినిమా ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో చాలా ప్లాన్‌ చేసుకున్నాడట. ముంబయి చేరుకున్న మేజర్ అతి త్వరలోనే ఒక సర్‌ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా హీరో అడవి శేషు ట్వీట్‌ చేసి అందరిలో ఆసక్తిని రేకెత్తించాడు. సినిమా విడుదల సమయంలో ఇలాంటి సర్ ప్రైజ్ లతో తప్పకుండా సినిమా పై జనాల్లో ఆసక్తి పెరగడం ఖాయం.

ఇంతకు అడవి శేషు ఇవ్వబోతున్న సర్‌ ప్రైజ్ ఏంటా అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. దానికి తోడు సినిమా లోని కీలక పాత్రల పరిచయం కూడా జరగాల్సి ఉంది. కనుక ముంబయిలో ప్రెస్ మీట్‌ ను ఏర్పాటు చేసి చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ విషయాలను వెళ్లడించే అవకాశాలు ఉన్నాయేమో.

మొత్తానికి ఇప్పటి వరకు మేజర్‌ పై ఉన్న అంచనాలను రెట్టింపు చేసే విధంగా ప్రమోషన్ కార్యక్రమాలకు అడవి శేషు ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా శోభిత ధూళిపాళ మరియు సాయి మంజ్రేకర్ లు నటించారు. వీరి పాత్రలు ఏంటి అనే విషయమై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.