Begin typing your search above and press return to search.

'మేజర్‌' పాన్ ఇండియా మూవీ కాదు ఆల్ ఇండియా మూవీ

By:  Tupaki Desk   |   4 April 2021 12:05 PM IST
మేజర్‌ పాన్ ఇండియా మూవీ కాదు ఆల్ ఇండియా మూవీ
X
అడవి శేషు ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'మేజర్‌' మూవీ విడుదలకు సిద్దం అయ్యింది. ఇప్పటికే మేజర్ నుండి అడవి శేషు లుక్ ను రివీల్‌ చేశారు. రియల్‌ హీరో మేజర్‌ సందీప్ ఉన్ని కృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌ గా సాయి మంజ్రేకర్‌ నటిస్తుంది. తాజాగా ఆమె లుక్‌ ను విడుదల చేశారు. సాయి మంజ్రేకర్‌ మరియు అడవి శేషులు ఒక స్కూల్‌ లో ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. సాయి మంజ్రేకర్‌ ఫస్ట్‌ లుక్‌ ను ఆవిష్కరించిన సందర్బంగా సినిమాపై అంచనాలు పెంచేలా అడవి శేషు వ్యాఖ్యలు చేశాడు.

రియల్‌ హీరో సందీప్ ఉన్ని కృష్ణన్ కథ అవ్వడంతో ఈ సినిమా ను దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. దాంతో ఈ సినిమాను పాన్‌ ఇండియా సినిమా అంటూ మీడియాలో ప్రస్థావిస్తూ వస్తున్నారు. తాజాగా అడవి శేషు ట్విట్టర్ లో స్పందిస్తూ ఈ సినిమా కేవలం పాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు ఇదో ఆల్‌ ఇండియా మూవీ అంటూ ట్వీట్‌ చేశాడు. మొత్తం ఇండియన్‌ సినీ ప్రేమికులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఎంతో మందికి ఇన్సిపిరేషన్‌ అయిన సందీప్ ఉన్ని కృష్ణన్‌ ను వెండి తెరపై చూడాలని కోరుకుంటున్నారు కనుక ఇది ఆల్‌ ఇండియా మూవీ అంటూ అడవి శేషు పేర్కొన్నాడు. సోనీ సంస్థతో కలిసి సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు నిర్మించిన ఈ సినిమా టీజర్ ను ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.