Begin typing your search above and press return to search.

చై - సామ్‌ లేకుండానే మొదలయ్యింది!

By:  Tupaki Desk   |   29 Sep 2018 10:33 AM GMT
చై - సామ్‌ లేకుండానే మొదలయ్యింది!
X
నాగచైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు’ - సమంత ‘యూటర్న్‌’ చిత్రాలతో తాజాగా ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. వీరిద్దరు ఇప్పటి వరకు కలిసి మూడు సినిమాలు చేశారు. పెళ్లి తర్వాత వీరి కలయికలో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇటీవలే వీరి కలయికలో ‘మజిలి’ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెల్సిందే.

‘నిన్ను కోరి’ చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు శివ నిర్వాన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం హాలీడే అకేషన్స్‌ ను స్పెయిన్‌ లో గడుపుతున్న చైతూ మరియు సమంతలు తమ మొదటి వివాహ వార్షికోత్సవం పూర్తి చేసుకున్న తర్వాత సినిమాలో నటించాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దాంతో షూటింగ్‌ వచ్చే నెల రెండవ లేదా మూడవ వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

‘మజిలి’ మూవీ నాగచైతన్య మరియు సమంత లేకుండానే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయినట్లుగా సమాచారం అందుతుంది. హైదరాబాద్‌ లో ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. హీరో - హీరోయిన్‌ లేకుండా ఉండే సీన్స్‌ ను పూర్తి చేయడంతో టైం సేఫ్‌ అవుతుందని దర్శకుడు భావించాడు. అందుకే ఈ షెడ్యూల్‌ మొత్తంను సమంత - నాగచైతన్య లేకుండానే చేయనున్నట్లుగా తెలుస్తోంది. అక్టోబర్‌ మూడవ వారం నుండి ‘మజిలి’ చిత్రీకరణలో ఈ స్టార్‌ కపుల్స్‌ నటించబోతున్నారు.