Begin typing your search above and press return to search.

నక్క తోక తొక్కిన అక్కినేని జంట

By:  Tupaki Desk   |   7 April 2019 4:21 AM GMT
నక్క తోక తొక్కిన అక్కినేని జంట
X
మజిలీ డీసెంట్ టాక్ తో మొదలై హిట్ వైపు దూసుకుపోతోంది. గత రెండు నెలలుగా సరైన సినిమా లేక అల్లాడుతున్న ప్రేక్షకులకు మజిలీ ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తోంది. మరీ గొప్పగా చిరకాలం నిలిచిపోయే క్లాసిక్ గా చెప్పుకునే మూవీ కానప్పటికీ ఎమోషనల్ కంటెంట్ జనానికి బాగానే కనెక్ట్ అవుతుండటంతో మూడు రోజులు సెలవులను అక్కినేని జంట పూర్తిగా వాడుకుని బుకింగ్స్ ని హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా ఏ సెంటర్స్ లో థియేటర్లు హౌస్ ఫుల్స్ తో అదరగొడుతున్నాయి.

మొదటి రోజు కన్నా శనిఆదివారాలు ఎక్కువ షేర్ రావొచ్చని ట్రేడ్ అంచనా. అయితే పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాకు ఇదంతా కామనే కాబట్టి అసలైన పరీక్ష రేపటి నుంచి ఉంటుంది. ఎక్కువ డ్రాప్ లేకుండా వీక్ ఎండ్ లో కూడా డీసెంట్ రన్ కనక కొనసాగించగలిగితే ఖచ్చితంగా మజిలీ చైతుకి కెరీర్ బెస్ట్ గా నిలుస్తుంది. లేదూ ఈ హంగామా అంత కొద్దిరోజులకే పరిమితం అనుకుంటే అప్పుడు లెక్క మారుతుంది

ఏదైతేనేం శివ నిర్వాణ రెండో గండం దాటేసి మొత్తానికి హిట్ అయితే ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇది ఫైనల్ గా ఎక్కడ ఆగుతుంది అనేది వేచి చూడాల్సిన విషయం.పెళ్ళికి ముందు ప్రేమ పెళ్ళికి తర్వాత ప్రేమ ఈ రెండు కోణాలను ఆవిష్కరించిన తీరుకు యూత్ కూడా బాగానే కనెక్ట్ అవుతున్నారు. ఫ్యామిలీస్ ఓటు కూడా దీనికే పడుతోంది. మజిలీ ఫలితం చూశాక శివ నిర్వాణకు ఆఫర్లు కూడా వెల్లువెత్తుతున్నాయట. అసలే రెండేళ్లుగా హిట్ చూడక చైతుతో పాటు అభిమానులు కూడా డల్ గా ఉన్నారు. ఈ టైంలో ఈ ఫలితం రావడం అంటే అంత కంటే కావాల్సింది ఏముంది.