Begin typing your search above and press return to search.

అమెజాన్ థియరీని మార్చేసిన మజిలీ

By:  Tupaki Desk   |   2 May 2019 1:30 AM GMT
అమెజాన్ థియరీని మార్చేసిన మజిలీ
X
ఏప్రిల్ 1 నుంచి కొత్త తెలుగు సినిమాలను డిజిటల్ లో కానీ శాటిలైట్ లో కానీ 60 రోజుల దాకా ప్రసారం చేయకూడదంటూ టాలీవుడ్ నిర్మాతలు నిర్ణయం తీసుకున్న తర్వాత విడుదలైన మొదటి సినిమా మజిలీ. దీని హక్కులు అమెజాన్ ప్రైమ్ వద్దే ఉన్నాయి. ఇప్పటిదాకా అమెజాన్ సంస్థ తెలుగు సినిమాలను రిలీజైన 30 రోజులకు ఒక్క సెకను కూడా ఆలస్యం చేయకుండా ఆన్ లైన్ స్ట్రీమింగ్ లో పెట్టేది.

ఇప్పుడా గడువు రెండు నెలలకు మారింది కాబట్టి మజిలిని జూన్ లో తప్ప అంతకు ముందే అప్ లోడ్ చేసే అవకాశం లేదు. సో ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ రన్ కొనసాగిస్తూ 30 కోట్లకు పైగా షేర్ రాబట్టిన మజిలీకి ఇది ఖచ్చితంగా మేలు చేసే పరిణామమే. ఒకవేళ ఆ నిబంధన రాకుండా ఉంటే సరిగ్గా ఇంకో నాలుగు రోజుల్లో మజిలీ అమెజాన్ లో వచ్చేసేది.

ఇప్పటిదాకా థియేటర్లో చూడని వాళ్ళు ఫ్రీగా లుక్కేసే ఛాన్స్ దక్కేది. అందులో అకౌంట్ ఉన్నా లేకపోయినా అది రకరకాల రూపాల్లో కోట్లాది ప్రేక్షకులకు చేరిపోయేది. అలా జరగలేదు కాబట్టి మజిలీకి అదనంగా లైఫ్ దొరికిందనే చెప్పాలి.సంక్రాంతికి విడుదలైన ఎఫ్2 ఇలా తొందరపడటం వల్లే ముప్పై రోజులకే యాప్ లో ప్రత్యక్షమై బలంగా ఉన్న థియేటర్ వసూళ్లకు అడ్డుకట్ట వేసింది. ఇప్పుడీ మార్పు వల్ల చిత్రలహరి-జెర్సీలు కూడా లాభం పొందాయి. లేకపోతే తేదీలు చెక్ చేసుకుని మరీ జనం అమెజాన్ వైపే చూసేవాళ్ళు