Begin typing your search above and press return to search.

మజిలీ 10 రోజుల కలెక్షన్స్

By:  Tupaki Desk   |   17 April 2019 7:59 AM GMT
మజిలీ 10 రోజుల కలెక్షన్స్
X
అక్కినేని నాగ చైతన్య.. సమంతా.. దివ్యాంన్ష కౌశిక్ ప్రధాన పాత్రలలో నటించిన 'మజిలీ' బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న 'మజిలీ' మొదటివారంలోనే బ్రేక్ ఈవెన్ అయింది. ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల రూపాయలకు 'మజిలీ థియేట్రికల్ హక్కులు అమ్మగా ఇప్పటివరకూ 31 కోట్ల రూపాలయ షేర్ వసూలు చేసి చైతు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

పదిరోజులలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 25 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 31 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్స్ సాధించింది. నైజాం ఏరియాలో చైతు సినిమా పది కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించడం మరో చెప్పుకోదగ్గ అంశం. పోటీలో సాయి తేజ్ 'చిత్రలహరి' ఉన్నప్పటికీ 'మజిలీ' ఇంకా డీసెంట్ కలెక్షన్స్ వసూలు చేస్తూ బ్లాక్ బస్టర్ దిశగా సాగిపోతోంది. వరస ఫ్లాపులతో నిరాశపడిన చైతుకు మాత్రమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ హీరోలకు.. ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా ఒక్కసారిగా జోష్ తీసుకొచ్చింది .

ప్రపంచవ్యాప్తంగా 'మజిలీ' 10 రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజామ్: 10.60 cr

సీడెడ్: 3.74 cr

ఉత్తరాంధ్ర: 3.71 cr

కృష్ణ: 1.65 cr

గుంటూరు: 1.92 cr

ఈస్ట్ : 1.51 cr

వెస్ట్: 1.13 cr

నెల్లూరు: 0.73 cr

ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 24.99 cr

కర్నాటక: 2.72 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.12 cr

అమెరికా: 2.24 cr

వరల్డ్ వైడ్ టోటల్: రూ. 31.07 cr