Begin typing your search above and press return to search.

మజిలీ భామ.. ఈ ఒక్కటి క్లిక్కయితే..

By:  Tupaki Desk   |   16 July 2022 12:30 AM GMT
మజిలీ భామ.. ఈ ఒక్కటి క్లిక్కయితే..
X
నాగచైతన్య సమంత నటించిన మజిలీ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ముఖ్యమైన పాత్రలో కనిపించిన దివ్యాంశ కౌశిక్ నటిగా ఐతే మంచి క్రేజ్ అందుకుంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో ఈ బ్యూటీకి అవకాశాలు అయితే చాలానే వచ్చాయి.

కానీ తొందరపడకుండా కేవలం తనకు నచ్చిన మంచి కంటెంట్ ఉన్న పాత్రలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంది. ఈ క్రమంలో ఆమె కొన్ని కమర్షియల్ సినిమాలను కూడా వదులుకున్నట్లు ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపించింది.

ఏదేమైనా కూడా దివ్యాంశ కౌశిక్ కాస్త ఆలస్యంగా అయినా సరే మంచి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని అనుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి తమిళంలో అయితే చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి.

ఆమధ్య సిద్ధార్థ్ తో నటించిన సినిమా కూడా నటిగా మంచి గుర్తింపును అందించింది. ఇక ప్రస్తుత ఈ బ్యూటీ తెలుగులో రవితేజ నటించిన రామారావు ఆన్ బ్యూటీ సినిమా ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ అయితే లేదు. కానీ తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది అని చిత్రంగా యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది. రెగ్యులర్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న దివ్యాంశ సినిమా రిజల్ట్ పై ఎంతో నమ్మకంగా ఉన్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా సక్సెస్ అయితే మాత్రం ఆమె కెరీర్ మరొక రేంజ్ కు వెళ్లడం ఖాయమని కూడా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ డ్యూటీ చేతిలో రెండు తమిళ సినిమాలతో పాటు అలాగే మలయాళం కన్నడ సినిమాలు కూడా ఉన్నాయట. ఇక తెలుగులో త్వరలోనే ఒక మీడియం రేంజ్ హీరోతో తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. మరి దివ్యాంశ కౌశిక్ రాబోయే సినిమాలతో మజిలీ రేంజ్ లో సక్సెస్ అందుకొని స్టార్ హీరోయిన్ గా బిజీ అవుతుందో లేదో చూడాలి.