Begin typing your search above and press return to search.

మహేష్‌ కూ ఒత్తిడి.. కోపం ఉంటాయట!

By:  Tupaki Desk   |   5 Oct 2021 3:00 PM IST
మహేష్‌ కూ ఒత్తిడి.. కోపం ఉంటాయట!
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటాడు. సినిమాల్లో కాకుండా బయట ఎప్పుడు చూసినా కూడా చిరు నవ్వుతో చాలా సహజంగా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటాడు. ఆయన సంపాదన మరియు ఆయన స్టార్‌ డమ్ నేపథ్యంలో ఆయనకు ఒత్తిడి ఎందుకు ఉంటుంది.. ఆయనకు కోపం ఎందుకు వస్తుందని అంతా అనుకుంటూ ఉంటారు. ఆయనకు బాధలు తెలియవు అలసట తెలియదు ఇతర ఏ ఇబ్బందులు కూడా ఆయనకు చినప్పటి నుండే తెలియవు అనేది చాలా మంది అభిప్రాయం. కాని ఎంత డబ్బున్నా.. ఎంత స్టార్ డమ్‌ ఉన్నా కూడా కొన్ని కాకుంటే కొన్ని అయినా ఇబ్బందులు.. అందరికి ఉండే కొన్ని ఎమోషన్స్ ఉంటూనే ఉంటాయి. ఆ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు తాజాగా ప్రముఖ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మహేష్‌ బాబు మాట్లాడుతూ నేను ఈ రోజున ఇంత స్టార్‌ డమ్‌ ను అనుభవిస్తున్నాను.. నాకు ఇంతగా స్టార్ డమ్‌ వచ్చింది అంటే ఖచ్చితంగా అది జనాల వల్లే. నా అభిమానులు నన్ను ఈ స్థాయిలో నిలిపారు. వాళ్లు ఇచ్చిన ఈ స్టార్‌ డమ్‌ మరియ స్థాయిని కాపాడుకోవడం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. స్టార్ డమ్‌ మెయింటెన్ చేయడం అనేది చాలా ఒత్తిడితో కూడుకున్నది. నాకు ఒత్తిడితో పాటు కోపం కూడా ఉంటుంది. నాకు కోపం వచ్చిన సమయంలో నా ఎదురుగా ఉన్న వారిపై అరుస్తూ ఉంటాను. ఆ సమయంలో సహనం కోల్పోయినట్లుగా వ్యవహరిస్తున్నాను. కొన్ని సెకన్లలో మళ్లీ తేరుకుంటాను. ఆ తర్వాత నేను గమనించేది ఏంటీ అంటే మనం ఎంత శాంతంగా ఉంటే పనులు అంత శాంతంగా జరుగుతాయి. అరుస్తూ ఉంటే పనులు అస్సలు జరుగవు అంటూ చెప్పుకొచ్చాడు.

మొదటి సారి ఇదే ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి కూడా మహేష్‌ బాబు మాట్లాడాడు. ఈ ఇంటర్వ్యూ ను నమ్రతతో కలిసి ఇచ్చిన మహేష్‌ బాబు పలు విషయాలను వెళ్లడించాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రీకరణ కోసం స్పెయిన్‌ వెళ్లాడు. అక్కడకు మహేష్ బాబు భార్య మరియు పిల్లలు కూడా వెళ్లారు. అక్కడ సర్కారు వారి పాట చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత చివరి షెడ్యూల్‌ ను మళ్లీ హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారట. ఈ నెల చివరి వరకు షూటింగ్‌ ను ముగించేలా దర్శకుడు పరశురామ్‌ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ మూవీని మహేష్‌ చేయబోతున్నాడు. ఆ తర్వాత రాజమౌళి సినిమా ఉంటుందట. సర్కారు వారి పాట వచ్చే సంక్రాంతికి విడుదల అవ్వబోతుండగా.. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.