Begin typing your search above and press return to search.

మెగా హోమ్ లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ అదేన‌ట‌

By:  Tupaki Desk   |   29 Nov 2019 11:54 AM IST
మెగా హోమ్ లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ అదేన‌ట‌
X
రాజులు పోయారు .. రాజ్యాలు పోయాయి. క్లాసిక్ డేస్ వింటేజ్ కార్లు ఇప్పుడు ఖ‌రీదైన కార్పొరెట్ విల్లాల్లోనే క‌నిపిస్తున్నాయి. రాజుల కాలంలోనే జ‌మీందార్ లు ప‌టౌడీలు ప‌ట్వారీలు అంటూ వీళ్లంతా వింటేజ్ కార్లలో తిరిగార‌ని.. బ్రిటీష్ వాళ్లు కానుక‌లుగా విసిరేసార‌ని ఎక్క‌డో పుస్త‌కాల్లో చ‌దువుకోవ‌డం త‌ప్ప మ‌నం డైరెక్టుగా ఆ కార్ల‌ను చూడ‌నూ లేదు.

ఇక వింటేజ్ కార్లు అంటే రెట్రో డేస్ సినిమాల్లో చూసి సంతోష‌ప‌డాలే కానీ సామాన్యుడి కంటికి ఎక్క‌డ క‌నిపిస్తుంది? 80ల‌లో రెట్రో స్టైల్లో హీరోగారు వింటేజ్ కార్ లో వెళుతుంటే ఆ రాజ‌స‌మే వేరుగా ఉండేది. కానీ ఇప్పుడు అదే వింటేజ్ కార్ ఖ‌రీదైన బంగ్లాల్లో విలాస‌వంత‌మైన డెక‌రేష‌న్ సామాగ్రిగానూ ద‌ర్శ‌న‌మిస్తోంది. బాలీవుడ్ లో కింగ్ ఖాన్ షారూక్.. టాలీవుడ్ లో కింగ్ నాగార్జున వంటి వాళ్లు వింటేజ్ కార్లు సేక‌రించి వాటిని ద‌ర్పానికి చిహ్నంగా ఇళ్ల‌లో డిస్ ప్లేల‌కు పెట్టార‌ని విన్నాం.

కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి రీమోడ‌ల్ చేసిన కొత్త ఇంట్లోనూ ఇలాంటి ఓ వింటేజ్ కార్ కొలువు దీర‌నుంద‌ని తెలుస్తోంది. పైగా ఈ కార్ ని సింగ‌పూర్ లో ఓ వేలంలో చిరు కొనేందుకు రెడీ అయ్యార‌ట‌. కొత్త ఇంట్లో ఏదో ఒక కొత్త‌ద‌నం కావాలి. న్యూ లుక్ అప్పియ‌రెన్స్ ఇంపార్టెంట్. పైగా అది ల‌గ్జ‌రీగా ఉండాలి. అందుకే ఆయ‌న మోజుప‌డి మ‌రీ కొంటున్నార‌ట‌. సింగ‌పూర్ లో `ఆర్టెఫాక్ట్స్ రీసెల్ల‌ర్స్` అనే కంపెనీ ఈ త‌ర‌హా వింటేజ్ వాహ‌నాల్ని రీసేల్ కి పెడుతోంద‌ట‌. అది కూడా వేలంలో ద‌క్కించుకోవాల్సి ఉంటుంది. ఒక‌వేళ ఈ కార్ చిరు ఇంటికి వ‌స్తే ఆయ‌న మ‌రో నైజాం కింగ్ లా అల‌రారుతార‌నే అభిమానులు భావిస్తున్నారు. 25000 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో విశాలంగా ఉన్న ఇంట్లో ఇలాంటి కార్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గానే నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఇక ఇప్ప‌టికే ఈ ఇంటిని నైజాం కాలంనాటి భ‌వంతిలా అద్భుత‌మైన ఆర్కిటెక్చ‌ర్ తో అల్ట్రా మోడ్ర‌న్ ఫెసిలిటీస్ తో తీర్చిదిద్దారు. చ‌ర‌ణ్‌- ఉపాస‌న ద‌గ్గ‌ర ఉండి మ‌రీ ఇంటీరియ్ ని డిజైన్ చేయించారు. వింటేజ్ కార్ డెక‌రేష‌న్ స‌హా స‌మ‌స్తం రెడీ అయ్యేవ‌ర‌కూ మెగాస్టార్ చిరంజీవి కొత్త ప‌లాటియ‌ల్ ప్యాలెస్ ని మీడియా కూడా వీక్షించ‌డం క‌ష్ట‌మే. ఆ త‌ర్వాత అయినా మాంచి వీడియోని ఉపాస‌న కొణిదెల సోష‌ల్ మీడియాలో వ‌దులుతారేమో చూడాలి.