Begin typing your search above and press return to search.
మెడకు ఉరితాడుతో ఉరి శిక్షలు ఆపాలంటూ మోడల్ నిరసన!
By: Tupaki Desk | 30 May 2023 10:12 AM GMTగత వారం రోజులుగా కేన్స్ 2023 ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో రెడ్ కార్పెట్ నడకలతో భారతీయ నటీమణులు అదరగొట్టారు. ఇప్పుడు వీటన్నిటికీ భిన్నంగా ఒక గొప్ప కాజ్ కోసం ఇరానీ మోడల్ చేసిన ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఇరాన్ లో ఉరిశిక్షలకు వ్యతిరేకంగా ప్రముఖ ఇరానీ మోడల్ తన నిరసనను తెలియజేసేందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. కేన్స్ ఫెస్టివల్ లో ఉక్రేనియన్ జెండా డిజైన్ తో మోడల్ మహ్లాఘా జబేరి బ్లాక్ బాడీకాన్ డ్రెస్ ను ధరించింది.
ఈ దుస్తుల పట్టీలు ఆమె మెడ చుట్టూ ఉచ్చులాగా బిగించి ఉన్నాయి. దాని దిగువ భాగంలో బలమైన ప్రకటన రాసి ఉంది. నిజానికి మెడ చుట్టూ ఆ పట్టీలు చూడగానే ఉరి వేసుకుంటోందా? అనే సందేహాన్ని కలిగించేలా ఆ డిజైన్ ని రూపొందించారు.
ప్రముఖ డిజైనర్ జిలా సాబెర్ సదరు మోడల్ దుస్తులను డిజైన్ చేసింది. రెడ్ కార్పెట్ పై జబేరి తన దుస్తులపై 'స్టాప్ ఎగ్జిక్యూషన్' కోట్ ని ప్రదర్శించింది. దీంతో మీడియా హెడ్ లైన్స్ లో ఇది హైలైట్ అయింది.మోడల్ తన దుస్తులను ధరించి ఉన్న వీడియో మాంటేజ్ ను సోషల్ మీడియాల్లో అప్ లోడ్ చేసింది. దానితో పాటు ఉరిశిక్షల అమలును ఆపండి అంటూ ఇరాన్ ప్రభుత్వాన్ని కదిలించే ప్రకటన చేసింది.
ఈ సంవత్సరం ఇరాన్ దేశంలో ఉరిశిక్షల పెరుగుదలను సదరు మోడల్ కేన్స్ వేదికగా హైలైట్ చేసింది. మానవ హక్కులకు ముప్పు కలిగించే భయంకరమైన పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాజిక కర్తలను అప్రమత్తం చేసింది. అంతకుముందు డిసెంబర్ లో నార్వే ఆధారిత మానవ హక్కుల కమీషన్.. ఇరాన్ మానవ హక్కుల నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం ఇరాన్ 2022లో ఇప్పటివరకు 500 మందికి పైగా ఉరితీసింది. ఐదేళ్లలో అత్యధిక రేటు ఇది. ఇరాన్ మానవ హక్కుల వివరాల ప్రకారం .. 2021లో ఇరాన్ లో కనీసం 333 మందికి మరణశిక్ష విధించింది. 16.5 శాతం అంటే 55 మరణశిక్షలు అధికారులే ప్రకటించారు.
2021 నివేదికలో (మొత్తం 278 మరణశిక్షలు) చేర్చబడిన మొత్తం మరణశిక్షల్లో 83.5 శాతం అధికారులు ప్రకటించలేదని నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. కనీసం 183 మరణశిక్షలు (అన్ని మరణశిక్షలలో 55 శాతం) హత్యా నేరాలకు సంబంధించినవి. 126 మరణశిక్షలు (38 శాతం) మాదకద్రవ్యాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నవి. 2020లో 25 (10 శాతం)తో పోలిస్తే ఈ ఏడాది అమాంతం మరణ శిక్షలు పెరిగాయి. మాదకద్రవ్యాలకు సంబంధించిన మరణశిక్షలను అధికారిక వర్గాలు నివేదించాయి.
అదే సమయంలో దైవదూషణకు మరణశిక్ష విధించబడిన ఇద్దరు వ్యక్తులను మేలో ఉరి తీశారు. మరణశిక్షకు గురైన ఇద్దరు వ్యక్తులు యూసెఫ్ మెహర్దాద్ - సద్రుల్లా ఫజెలీ జారేలను మేలో అరెస్టు చేశారు. 2020 లో ఇరాన్ వార్తా సంస్థ మిజాన్ వివరాల ప్రకారం.. ఆన్ లైన్ లో ఇస్లాం వ్యతిరేక సమూహాలు .. ఛానెల్ లను నిర్వహిస్తున్నందుకు ఏప్రిల్ 2021లో ఆ ఇద్దరికి మరణశిక్ష విధించారని తెలిసింది.