Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ఎంట్రీతో హాటీ ఎగ్జైట్మెంట్

By:  Tupaki Desk   |   27 Jan 2017 6:02 AM GMT
టాలీవుడ్ ఎంట్రీతో హాటీ ఎగ్జైట్మెంట్
X
మహిమ మక్వానా.. ఇప్పటికైతే టాలీవుడ్ ఆడియన్స్ కు ఈమె ఎవరో ఇంకా తెలీదు కానీ.. తను నటిస్తున్న ఫస్ట్ ఫిలిం వెంకటాపురం రిలీజ్ అయ్యాక.. తెలుగు ఆడియన్స్ కు తెగ దగ్గరైపోతా అనే నమ్మకంతో ఉంది ఈ టీనేజ్ బ్యూటీ. 9 ఏళ్ల వయసులోనే కెరీర్ ప్రారంభించిన మహిమ.. 17 ఏళ్లకే హీరోయిన్ గా అరంగేట్రం చేసేస్తోంది.

ఇదంతా విధి అంటూ కొంచెం వేదాంతానికి దగ్గరగా మాట్లాడుతున్నా.. ఆమె చెబుతున్న యాంగిల్ వింటే మాత్రం కరెక్టే అనిపిస్తుంది. 'ఇది నాకు టాలీవుడ్ లోకి మాత్రమే కాదు.. సినిమా ఫీల్డ్ లోకే అరంగేట్రం. మొదటి సినిమా ఎంచుకోవడం అంత తేలికైన విషయం కాదు. వెంకటాపురం ఆఫర్ రాగానే.. నేను కోరుకున్నది ఇదే అనిపించింది. మొదటి సినిమా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అక్కడి నుంచి సినిమాలను మనం ఎంచుకోవాలి. అదే విధి అంటే' అని చెప్పింది మహిమా మక్వానా.

హిందీ సీరియల్స్ లో ఈమె చాలామందికే పరిచితం. సినిమా రంగంలోకి రావాలని.. ఇతర రంగాల్లో విస్తరించాలనే టార్గెట్ ముందు నుంచి ఉన్న మహిమ.. ప్రస్తుతం ముంబైలో ట్వల్త్ స్టాండర్డ్ చదువుకుంటోంది. తెలుగులో నటించడం అంటే.. మొదట భాష విషయంలో ఇబ్బంది పడ్డా.. ఆ తర్వాత ప్రత్యేకంగా ట్యూటర్ ను ఏర్పాటు చేసుకుని మరీ పట్టు పెంచుకున్నానని చెప్పింది. రాహుల్ కి జోడీగా మహిమా మక్వానా నటించిన ఈ వెంకటాపురం మూవీ వేణి మదికంటి దర్శకత్వంలో రూపొందింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/